“స్వస్థత ప్రార్థనలు” యొక్క ప్రపంచవ్యాప్త వ్యవస్థ

తన శిష్యులను ఆశీర్వదిస్తున్న యోగానందగారు

పరమహంస యోగానందగారు ప్రపంచ శాంతి కోసం మరియు ఇతరుల శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక బాధల నివారణ కోసం తన ప్రార్థనల ద్వారా మానవజాతికి గొప్ప సేవ చేశారు. ప్రతి ఉదయం గాఢమైన ధ్యానంలో ఆయన సహాయం కోరిన వారందరిపై దేవుని ఆశీస్సుల కొరకు ప్రార్థించారు. మరియు సరళమైన, అత్యంత ప్రభావవంతమైన ప్రక్రియ ద్వారా వారికి స్వస్థత శక్తిని పంపించేవారు.కొంత సమయం గడిచిన తర్వాత, పరమహంసగారు ప్రార్థన ద్వారా ప్రపంచానికి సేవ చేసే ఈ ప్రయత్నంలో తనతో చేరాలని యోగదా సత్సంగ సన్యాసులు మరియు సన్యాసినులను కోరారు. అలా యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రార్థన మండలి ఆవిర్భవించింది.

పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక వారసుల నేతృత్వంలో, ఈ ప్రార్థన మండలి పని సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రతి ఉదయం మరియు సాయంత్రం ప్రార్థన మండలి సభ్యులు గాఢంగా ధ్యానం చేస్తారు, ఇతరుల కోసం ప్రార్థిస్తారు, మరియు పరమహంస యోగానందగారు ఆచరించిన మరియు బోధించిన స్వస్థత ప్రక్రియను సాధన చేస్తారు. శరీరం, మనస్సు మరియు ఆత్మ యొక్క స్వస్థత కోసం ప్రార్థన మండలి ద్వారా ఇతరులకు సమర్ధవంతంగా పంపబడుచున్న దేవుని అపరిమిత శక్తిని ధృవీకరిస్తూ సహాయాన్ని కోరి, పొందిన వారి నుండి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకు లెక్కలేనన్ని లేఖలు వ్రాయబడ్డాయి.

పరమహంస యోగానందగారు తరచుగా ఇలా కోరేవారు, ప్రార్థన మండలి యొక్క స్వస్థత కలిగించే పనిని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యులు మరియు స్నేహితుల ప్రార్థనల ద్వారా ప్రతి ప్రదేశంలోను పెంపొందించమని, సానుభూతితో కూడిన హృదయాలతో ఆధ్యాత్మిక సంఘాన్ని సృష్టించమని – ఇదే ప్రపంచవ్యాప్త ప్రార్థన మండలి.

ప్రపంచవ్యాప్త ప్రార్థన మండలి స్థాపించబడినప్పటి నుండి, దీనిలో పాల్గొనేవారు చేసే ప్రార్థనలు ప్రపంచవ్యాప్తంగా సామరస్యం, సుహృద్భావం మరియు శాంతిని పెంపొందించడానికి, ప్రపంచం మొత్తం దివ్య శక్తిని ఒక పెరుగుతున్న ప్రవాహము సృష్టించడానికి సహాయపడ్డాయి.

మీ ప్రార్థనల యొక్క ఆత్మ శక్తితో ఈ స్వస్థత తరంగాలను బలోపేతం చేయడానికి మీరు సహాయపడతారని మేము ఆశిస్తున్నాము. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఆశ్రమాలు, కేంద్రాలు మరియు ధ్యాన సమూహాలలో ప్రతి వారము ప్రార్థన సేవలు జరుగుతాయి. ఒకవేళ మీరు ఈ సేవలకు హాజరు కాలేకపోతే, లేదా మీరు మరొక ఆధ్యాత్మిక బోధనను అనుసరిస్తున్నట్లయితే, మీరు ప్రతి వారం మీ స్వంత ఇంటిలో ఒక వ్యక్తిగత సేవ చేయాలనుకోవచ్చు. ముందుగా చెప్పినట్లుగా, ప్రార్థన మరియు స్వస్థత యొక్క ప్రాథమిక సూత్రాలు ఇక్కడ వివరించబడ్డాయి, మతపరమైన అనుబంధంతో సంబంధం లేకుండా ఇవి ఎవరికైనా వర్తిస్తాయి.

అంతరిక్షం నుండి కనిపించే భూమి

Share this on