మీ నిజ స్వరూపాన్ని మేలుకొలపటానికి అమరత్వపు ఆలోచనలను ఉపయోగించటం ఎలా

శ్రీ శ్రీ పరమహంస యోగానంద

పరమహంస యోగానందగారి జ్ఞాన వారసత్వం నుండి

పరమహంస యోగానందగారు ఇలా వ్రాశారు:

“మీరు భగవంతుని ఆలోచనతో అనుసంధానమై, మాయ అనే మేకును సరైన సత్యాలోచన అనే సుత్తితో కొట్టినట్లయితే, మీరు మాయను అధిగమించవచ్చు.

అమరత్వపు ఆలోచనతో ప్రత్యామ్నాయం చేయడం ద్వారా అన్ని మర్త్య ఆలోచనలను నాశనం చేయండి.”

పరమహంసగారి ఉపన్యాసములు మరియు రచనల నుండి సేకరించిన ఈ సంకలనంలో ఇటాలిక్ చేయబడిన భాగాలు ధృవీకరణలు మరియు ఆత్మ యొక్క ప్రత్యక్షానుభవాలు — “అమరత్వపు భావనలు” — మీలోనూ మరియు మొత్తం సృష్టిలోనూ వ్యాపించి ఉన్న శాశ్వతమైన, ఆనందకరమైన వాస్తవికతను అనుభవం చెందటం కోసం మీరు ఉపయోగించుకోవచ్చు.

పగలు రాత్రి, మీరు నిజంగా ఏమిటో ధృవీకరించుకోండి

ఈ సత్యాన్ని మీకు మీరు ఎడతెగకుండా పునశ్చరణ చేసుకోండి:

“నేను మార్పుచెందనివాడిని, నేను అనంతుడిని. నేను విరిగే ఎముకలు, నశించే శరీరం ఉన్న చిన్న మర్త్యుడిని కాదు. నేను మరణం లేని, మార్పులేని అనంతుడిని.”

ఒక తాగుబోతు యువరాజు మురికివాడల్లోకి వెళ్ళి, తన నిజస్వరూపాన్ని పూర్తిగా మరచిపోయి, “నేను ఎంత పేదవాడిని” అని విలపించడం ప్రారంభిస్తే, అతని స్నేహితులు అతనిని చూసి నవ్వుతూ, “మేల్కోండి, మీరు యువరాజు అని గుర్తుంచుకోండి” అని చెబుతారు. మీరు కూడా నిస్సహాయ మృత్యువుగా భావించి, కష్టపడుతున్న మరియు దయనీయమైన భ్రాంతికరమైన స్థితిలో ఉన్నారు. ప్రతిరోజూ మీరు నిశ్శబ్దంగా కూర్చుని, గాఢమైన నిశ్చయంతో ధృవీకరించాలి:

“నాకు జననం లేదు, మరణం లేదు, కులం లేదు; తల్లి, తండ్రి, నాకు ఎవరూ లేరు. దివ్యమైన ఆత్మను, నేను ఆయనను. నేనే అనంతమైన ఆనందాన్ని.”

మీరు పగలు రాత్రి ఈ ఆలోచనలను మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేస్తే, మీరు ఎవరో చివరికి మీరు నిజంగా తెలుసుకుంటారు: అమరమైన ఆత్మ.

మీ నిజస్వరూపాన్ని దాచిపెట్టే అన్ని పరిమిత ఆలోచనలను తొలగించండి

మీరెవరో మీకు తెలియకపోవడం? మీ స్వభావం మీకు తెలియకపోవటం? విచిత్రం కదా. మీరు మీ శరీరానికి మరియు మర్త్య పాత్రలకు వర్తించే అనేక విభిన్న పేర్ల ద్వారా మిమ్మల్ని మీరు నిర్వచించుకుంటారు….మీరు ఈ పేర్లను ఆత్మ నుండి తీసివేయాలి.

“నేను ఆలోచిస్తాను, కానీ నేను ఆలోచనను కాదు. నేను భావిస్తున్నాను, కానీ నేను భావాన్ని కాదు. నేను సంకల్పిస్తాను, కానీ నేను సంకల్పమును కాదు.”

ఇంక ఏమి మిగిలింది? మీరు ఉన్నారని తెలిసిన మీరు; మీ ఉనికిని అనుభవించే మీరు – అంతర్ దృష్టి ద్వారా అందించబడిన రుజువు ద్వారా, తన ఉనికి తనకు ఆత్మ యొక్క బేషరతైన ఎరుక

ఆకాశంలో నక్షత్రాలు.రోజంతా, మీరు నిరంతరం శరీరం ద్వారా పని చేస్తూ ఉంటారు, కాబట్టి మీరు అదేనని భావిస్తున్నారు. కానీ మిమ్మల్ని బంధించే మాయను దేవుడు ప్రతి రాత్రి మీ నుండి తొలగిస్తాడు. గత రాత్రి, గాఢమైన కలలు లేని నిద్రలో, మీరు ఒక స్త్రీ లేదా పురుషుడు లేదా అమెరికన్ లేదా హిందువు లేదా ధనికుడివా లేదా పేదవాడివా? లేదు. మీరు స్వచ్ఛమైన ఆత్మగా ఉన్నారు….గాఢనిద్ర యొక్క అర్ధ-అధిచేతన స్వేచ్ఛలో దేవుడు మీ అన్ని మర్త్య బిరుదులను తీసివేస్తాడు మరియు మీరు శరీరం యొక్క అన్ని పరిమితులకు వేరుగా ఉన్నారని మీకు అనిపించేలా చేస్తాడు–స్వచ్ఛమైన చైతన్యం, శూన్యంలో విశ్రాంతి. ఆ విశాలత్వమే మీ నిజమైన స్వరూపం.

ప్రతి ఉదయం మీరు మేల్కొన్నప్పుడు ఈ సత్యాన్ని మీకు మీరు గుర్తు చేసుకోండి:

“నేను నా యొక్క అంతర్దృష్టి నుండి వస్తున్నాను. నేను ఈ శరీరం కాదు. నేను అదృశ్యంగా ఉన్నాను. ఆనందమే నేను. కాంతిని నేను. జ్ఞానాన్ని నేను. ప్రేమను నేను. నేను ఈ భూమిపై జీవితాన్ని కల కంటున్న స్వప్న శరీరంలో నేను నివసిస్తున్నాను; కానీ నేను ఎప్పటికీ శాశ్వతమైన ఆత్మను.”

వైఫల్యాల కాలమే విజయానికి బీజాలు వేయడానికి సరైన సమయం. పరిస్థితుల దెబ్బ మిమ్మల్ని గాయపరచవచ్చు, కానీ మీ తల నిటారుగా ఉంచండి. మీరు ఎన్నిసార్లు విఫలమైనప్పటికీ, ఎల్లప్పుడూ మరోసారి ప్రయత్నించండి. మీరు ఇకపై పోరాడలేరని మీరు అనుకున్నప్పుడు కూడా పోరాడండి లేదా మీరు ఇప్పటికే మీ వంతు కృషి చేశారని మీరు అనుకున్నప్పుడు కూడా పోరాడండి, మీ ప్రయత్నాలు విజయవంతమయ్యే వరకు పోరాడండి.

విజయం యొక్క మనోవిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి. “అసలు వైఫల్యం గురించి మాట్లాడకండి” అని కొందరు సలహా ఇస్తారు. కానీ అది మాత్రమే సరిపోదు. మొదట, మీ వైఫల్యం మరియు దాని కారణాలను విశ్లేషించండి, అనుభవం నుండి ప్రయోజనం పొందండి, ఆపై దాని గురించిన అన్ని ఆలోచనలను విడిచిపెట్టండి. ఎవరైతే చాలాసార్లు విఫలమైనప్పటికీ, తన అంతరంగంలో ఓటమి లేకుండా నిరంతరం పోరాడుతారో వారే నిజమైన విజేత.

జీవితం చీకటిగా ఉండవచ్చు, కష్టాలు రావచ్చు, అవకాశాలు ఉపయోగించుకోకుండానే జారిపోవచ్చు, కానీ మీకు మీరు ఎప్పుడూ ఇలా అనుకోకండి: “నా కథ ముగిసింది. దేవుడు నన్ను విడిచిపెట్టాడు.” అలా అనుకునే వ్యక్తి కోసం ఎవరు మాత్రం ఏం చేయగలరు? మీ కుటుంబం మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు; అదృష్టం మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు; మనిషి మరియు ప్రకృతి యొక్క అన్ని శక్తులు మీకు వ్యతిరేకంగా అమర్చబడి ఉండవచ్చు; అయినప్పటికీ మీ గతం తాలూకు తప్పుడు చర్యల ద్వారా సృష్టించబడిన విధి యొక్క ప్రతీ దండయాత్రను మీలోని దివ్య ప్రేరణ కారణంగా ఓడించి మీరు విజయవంతంగా స్వర్గంలోకి సాగవచ్చు.

భగవంతుని నుండి వేరుకాని వారుగా మిమ్మల్ని మీరు తెలుసుకోండి

నెబులా

అత్యున్నతమైన జ్ఞానం ఆత్మసాక్షాత్కారమే – అంటే తనను తాను ఎరిగి, ఆత్మ, భగవంతుని నుండి ఎన్నడూ వేరు కానట్టుగా తెలుసుకోవడం… ఒకే ఉనికి సృష్టిలోని అన్నిటిలోనూ అంతర్భాగంగా ఉంది. “ఓ అర్జునా! అన్ని జీవుల హృదయాలలో ఆత్మగా ఉన్నది నేనే: వాటి మూలం నేనే, ఉనికి మరియు అంతం కూడా నేనై ఉన్నాను.” (గాడ్ టాక్స్ విత్ అర్జున: ద భగవద్గీత X:20.)

గొప్ప గురువులందరూ ఈ శరీరంలో అమరమైన ఆత్మ ఉందని, అది అన్నింటికీ ఆధారభూతం అయిన దానికి తేజః కణం అని ప్రకటించారు. తన ఆత్మను తెలుసుకొన్నవాడికి ఈ సత్యం తెలుస్తుంది:

“నేను పరిమితమైన ప్రతిదానికీ అతీతుడను….నేను నక్షత్రాలను, నేనే అలలను, నేనే అందరికీ జీవాన్ని; నేనే అందరి హృదయాలలో దరహాసాన్ని, పుష్పాల ముఖాలలో మరియు ప్రతి ఆత్మలో చిరునవ్వును నేనే. సమస్త సృష్టిని నిలబెట్టే జ్ఞానము మరియు శక్తిని నేనే.”

ఆలోచించండి, ధృవీకరించండి, మీ దివ్య స్వభావాన్ని గ్రహించండి

యుగయుగాల నాటి తప్పుడు ఆలోచనలను నాశనం చేయండి–మనం బలహీనమైన మనుషులం. మనం దేవుని సంతానమని ప్రతిరోజూ ఆలోచించాలి, ధ్యానించాలి, ధృవీకరించాలి, విశ్వసించాలి మరియు గ్రహించాలి.

“అది ఒక ఆలోచన మాత్రమే” అని మీరు అనవచ్చు. అయితే మరి, ఆలోచన అంటే ఏమిటి? మీరు చూసేదంతా ఒక తలంపు యొక్క ఫలితం….అదృశ్యమైన ఆలోచన అన్ని విషయాలకు వాస్తవికతను అందిస్తుంది. కాబట్టి మీరు మీ ఆలోచన ప్రక్రియలను నియంత్రించగలిగితే, మీరు ఏదైనా కనిపించేలా చేయవచ్చు; మీ ఏకాగ్రత శక్తితో మీరు దానిని సాకారం చేసుకోవచ్చు…

మీ ఆలోచనలను నియంత్రించడం మరియు మీ మనస్సును అంతర్ముఖం చేయటం నేర్చుకుంటే, శాస్త్రోక్తంగా గురువు ఇచ్చిన ధ్యాన ప్రక్రియల ద్వారా, క్రమంగా మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతారు: మీ ధ్యానాలు గాఢంగా ఉంటాయి మరియు మీ అదృశ్య స్వరూపం, లోపల ఉన్న భగవంతుని ఆత్మ-స్వరూపం మీ అనుభవంలోకి వస్తుంది.

మీరు నిర్మూలించాలనుకున్న ఆలోచనలను నిర్మాణాత్మకమైన ఆలోచనలతో భర్తీ చేయడం ద్వారా వాటిని తీసివేయండి. ఇది స్వర్గానికి కీలకం; అది మీ చేతుల్లో ఉంది….

మనని మనం ఎలా అనుకుంటామో మనం అలాగే ఉంటాము….మీ చైతన్యాన్ని మర్త్యజీవి స్థాయి నుండి దివ్య జీవి స్థాయికి మార్చుకోండి.

“నేను అనంతుడను. ప్రదేశ పరిమితులకు అతీతుడను, అలసట లేనివాడను; నేను శరీరం, ఆలోచన మరియు వాక్కులకు అతీతుడను; పదార్థం మరియు మనస్సుకు అతీతుడను. నేను అంతులేని ఆనందమును.”

దివ్య సత్యాన్ని మనస్సులో నిరంతరం ముద్రించండి

అనారోగ్యం, వృద్ధాప్యం, మరణం వంటి మానవ పరిమితులను మనస్సుకు సూచించటం మానండి. బదులుగా, ఈ సత్యాన్ని మనస్సులో నిరంతరం ముద్రించండి:

“శరీరంగా మారిన అనంతుడను నేను. శరీరం పరమాత్మ యొక్క అభివ్యక్తియే కనుక శరీరం ఎప్పటికీ పరిపూర్ణమైన, నిత్య యవ్వనమైన పరమాత్మయే.”

బలహీనత లేదా వయస్సు యొక్క ఆలోచనల ద్వారా పరిమితం కావడానికి నిరాకరించండి. మీరు వృద్ధులని మీకు ఎవరు చెప్పారు? మీకు వయసు లేదు. మీరు, ఆత్మ, శాశ్వత యవ్వనులు. మీ చైతన్యంపై ఆ ఆలోచనను ముద్రించండి:

“నేను ఆత్మను, నిత్య యవ్వనుడైన పరమాత్మ యొక్క ప్రతిబింబమును. నేను యవ్వనంతో, ఆశయంతో, విజయం సాధించగలిగే శక్తితో స్పందిస్తూ ఉన్నాను.”

నిరంతర ప్రయత్నాన్ని చిత్రించే జలపాతం.

విశ్వ శక్తితో మిమ్మల్ని మీరు అనుసంధానించుకోండి, మీరు ఫ్యాక్టరీలో పని చేస్తున్నా లేదా వ్యాపార ప్రపంచ వ్యక్తులతో ఉన్నా, ఎప్పుడూ ధృవపరచుకోండి:

“నాలో అనంతమైన సృజనాత్మక శక్తి ఉంది. కనీసం కొన్ని విజయాలు లేకుండా నేను మరణించను. నేను దేవుణ్ణి, హేతుబద్ధమైన జీవిని. నేను నా ఆత్మ యొక్క క్రియాశీలతకు మూలమైన పరమాత్మ శక్తిని. నేను వ్యాపార ప్రపంచంలో, ఆలోచనా ప్రపంచంలో, జ్ఞాన ప్రపంచంలో ఆవిష్కరణలను సృష్టిస్తాను. నేను, నా తండ్రి ఒక్కటే. నా సృజనాత్మక తండ్రి వలెనే నేను కూడా కోరుకునే దేన్నైనా సృష్టించగలను.”

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. పాఠాలు దేవుని విశ్వశక్తి సముద్రమైన విశ్వ ప్రాణంతో సంపర్కం ఎలా పెట్టుకోవాలో నేర్పుతాయి…. మందులు, భావోద్వేగం మొదలైన కృత్రిమ ఉద్దీపనల ద్వారా కాక ఆ శక్తిని నేరుగా ఆంతరంగిక మూలం నుండి పొందడమే గొప్ప పద్ధతి. అప్పుడు మీరు ఇలా చెప్పవచ్చు:

“కండరాల క్రిందనే విపరీతమైన ప్రవాహం ఉంది. నేను దానిని మరచిపోయాను, కానీ ఇప్పుడు, ఆత్మసాక్షాత్కారం అనే గునపంతో త్రవ్వడం ద్వారా, నేను ఆ ప్రాణశక్తిని మళ్ళీ కనుగొన్నాను….నేను మాంసమును కాదు. నేనే ఈ దేహామంతా వ్యాపించి ఉన్న దివ్య విద్యుత్ ఆవేశాన్ని.”

కష్టాల ద్వారా మీ ఆత్మకు హాని జరగదు

మీరు అమరులని తెలుసుకోండి – మీరిక్కడ ఉన్నది మీ అమరత్వాన్ని మరియు చిరునవ్వును అలవరచుకొని, వ్యక్తపరచడానికి, నశ్వరమైన పాఠాల ద్వారా నలిగిపోవడానికి కాదు. ఇలా అనండి:

“నేను అమరుడిని, నా అమరత్వాన్ని నేర్చుకొని, తిరిగి పొందడానికి మర్త్య పాఠశాలకు పంపబడ్డాను. భూమి యొక్క సర్వశుద్ధకరమైన జ్వాలలచే సవాలు చేయబడినప్పటికీ, నేను ఆత్మను, నాశనం కాను. అగ్ని నన్ను దహించలేదు; నీరు నన్ను తడపలేదు; గాలులు నన్ను ఎండగొట్టలేవు; పరమాణువులు నన్ను ధ్వంసం చేయలేవు; నేను అమరత్వ పాఠాలకై కలలు కనే అమరుడిని – నలిగిపోకూడదు, వినోదం పొందాలి.”

జీవితంలో కష్టాలను సూచించే సముద్రపు పోటు.

మీరు ఎన్నో జన్మలలో ఎన్నో పాత్రలు పోషించారు. కానీ అవన్నీ మిమ్మల్ని అలరించడానికి ఇవ్వబడ్డాయి–మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. నీ అమరమైన ఆత్మను ఏవీ తాకలేవు. జీవిత చలన చిత్రంలో మీరు ఏడవవచ్చు, నవ్వవచ్చు, మీరు అనేక పాత్రలను పోషించవచ్చు; కానీ అంతరంగంలో మీరు ఎప్పుడూ, “నేను ఆత్మను” అని చెప్పుకోవాలి. ఆ జ్ఞానాన్ని గ్రహించడం వల్ల గొప్ప ఓదార్పు లభిస్తుంది.

“నేను మధురమైన అమరత్వపు దివ్యమైన బిడ్డను, జనన మరణాల నాటకం ఆడటానికి ఇక్కడకు పంపబడ్డాను, కానీ నా మరణం లేని స్వరూపమును ఎప్పుడూ గుర్తుంచుకుంటాను.

“విముక్తాత్మ సాగరం నా ఆత్మ అనే చిన్న బుడగగా మారింది. ఈ జీవితపు బుడగను నేను – విశ్వ చైతన్య సాగరంతో ఒకటై ఉన్నాను. నేను ఎప్పటికీ చనిపోను. పుట్టుకలో తేలుతున్నా లేదా మరణంలో అదృశ్యమైనా, నేను నాశనం చేయలేని చైతన్యమును, ఆత్మ అమరత్వపు హృదయంలో సురక్షితంగా ఉన్నాను.”

దేనికీ భయపడకండి, ఎందుకంటే మీరు దేవుని బిడ్డ

మీరు ధ్యానంలో కళ్ళు మూసుకున్నప్పుడు, మీరు మీ చైతన్యం యొక్క విస్తారతను చూస్తారు – మీరు శాశ్వతత్వపు కేంద్రంలో ఉండటం చూస్తారు. అక్కడ కేంద్రీకరించండి; ఉదయం మరియు సాయంత్రం కొంచెం సమయం కేటాయించి కళ్ళు మూసుకుని ఇలా చెప్పండి:

“నేను అనంతుడిని; నేను ఆయన బిడ్డను. తరంగం సముద్రానికి ఉబ్బెత్తు; నా చైతన్యం మహోన్నతమైన విశ్వచైతన్యానికి ఉబ్బెత్తు. నేను దేనికీ భయపడను. నేను ఆత్మను.”

ఎప్పుడూ భగవంతుని అంతర్లీనమైన ఉనికిని స్పృహలో ఉంచుకోండి. ఎప్పుడూ స్థిరచిత్తంతో ఇలా చెప్పండి:

“నేను భయరహితుడిని; నేను భగవత్ పదార్థంతో తయారయ్యాను. నేను ఆత్మయొక్క అగ్నికణాన్ని. నేను విశ్వ జ్వాల యొక్క అణువును. నేను నా తండ్రి యొక్క విశాల విశ్వ దేహపు కణాన్ని. ‘నేను, నా తండ్రి ఒకటే’”

లావా కరగడం అనేది దేవునిలో ఆత్మ విలీనం కావడాన్ని సూచిస్తుంది.చైతన్యంలో ఎప్పుడూ భయరహితులుగా ఉండండి:

“జీవితంలో మరియు మరణంలో నేను ఎప్పుడూ భగవంతునితో జీవిస్తున్నాను.”

మీరు ఈ పద్ధతులు సాధన చేస్తుంటే రోజు రోజుకు ఈ స్పృహ మీపై ప్రభావం చూపుతుంది. ధ్యానంలో గాఢమైన అంతర్ముఖ ప్రశాంతతలోకి ప్రవేశించినప్పుడు, మీరు శరీర బంధనం నుండి విముక్తులు అవుతారు. అప్పుడు నీకు మరణం ఏమిటి? భయం ఎక్కడుంది? మిమ్మల్ని భయపెట్టే శక్తి దేనికీ లేదు. అదే మీరు కోరుకునే స్థితి. ఓంకారం పై దృష్టి కేంద్రీకరించండి, గాఢమైన ధ్యానంలో ఓంకారంలో విలీనం చెందండి; విశ్వ ప్రకంపనలో భగవంతుని అంతర్లీనతను గ్రహించడం ద్వారా, మీరు “తండ్రిని చేరుతారు”– అనంతమైన, అతీతమైన పూర్ణత్వం యొక్క పరమానంద – చైతన్యం.

“నేను మరియు నా ఆనందమయుడైన దేవుడు ఒక్కటే. ఈ విశ్వంలో నాకు అన్నీ ఉన్నాయి. మరణం, వ్యాధి, ప్రళయం, అగ్ని జ్వాలలు, ఏదీ ఆ ఆనందాన్ని తీసివేయలేవు!”

మీరు ఆత్మ స్వరూపులు: మీ ఆధ్యాత్మిక లక్షణాలను ధృవీకరించండి

ఆత్మ యొక్క నిర్లిప్తత గుణాన్ని వర్ణించే కమలం.

మీ జీవితంలోని అన్ని అందమైన మరియు సానుకూల లక్షణాలను గుర్తుంచుకోవడానికి మరియు దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి మరియు మీ లోపాలను స్థిరపరచవద్దు.

సాధకుడైన యోగి తనకు కోపం వచ్చినప్పుడు, “అది నేను కాదు!” అని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. తన ఆత్మనిగ్రహమును కామము లేదా దురాశ ఆక్రమిస్తున్నప్పుడు, “అది నేను కాదు!” అని తనలో తాను చెప్పుకోవాలి. వికారమైన భావోద్వేగాల ముసుగులో ద్వేషం తన నిజ స్వభావాన్ని మసకబార్చడానికి ప్రయత్నించినప్పుడు, “అది నేను కాదు!” అని అతను దాని నుండి బలవంతంగా విడివడాలి. అలా అతని లోపల బస చేయాలనుకునే అవాంఛనీయ సందర్శకులందరికీ వ్యతిరేకంగా తన చైతన్యం యొక్క తలుపులు మూసివేయడం నేర్చుకుంటాడు. అలాగే, ఆ భక్తుడు ఇతరులచే వాడుకోబడినా లేదా దుర్వినియోగం చేయబడినా కూడా, అతను క్షమ మరియు ప్రేమ యొక్క పవిత్రశక్తిచే ప్రేరేపితుడైనప్పుడల్లా, అతను దృఢ నిశ్చయంతో, “అది నేనే! అదే నా అసలు స్వభావం.” అని విశ్వాసంతో ధృవీకరించవచ్చు.

ధ్యాన యోగం అనేది ఖచ్చితమైన ఆధ్యాత్మిక మనోభౌతిక పద్ధతులు మరియు నియమాల ద్వారా సంకుచితమైన అహం, పారంపర్యంగా దోషభూయిష్టమైన మానవ చైతన్యమును ఆత్మ చైతన్యముతో మార్పిడి చేసి తన నిజస్వరూపం యొక్క ఎరుకను అలవాటులోకి తెచ్చుకుని స్థిరపరుచుకునే ప్రక్రియ.

ప్రియులారా, మిమ్మల్ని ఎవరూ పాపులు అని పిలవనివ్వకండి. మీరు దేవుని కుమారులు, ఎందుకంటే ఆయన మిమ్మల్ని తన స్వరూపంలో సృష్టించాడు…. మీకు మీరు ఇలా అనుకోండి:

“నా పాపాలు సముద్రమంత లోతుగా మరియు నక్షత్రాలంత ఎత్తులో ఉన్నా, నేను ఓడింపబడను, ఎందుకంటే నేను స్వయంగా ఆత్మను.”

మీరు కాంతి స్వరూపులు, మీరు ఆనంద స్వరూపులు

ఒక గుహలో చీకటి వేల సంవత్సరాలు పాలించవచ్చు, కానీ వెలుగును తీసుకురండి, చీకటి ఎన్నడూ లేనట్లుగా అదృశ్యమవుతుంది. అదే విధంగా మీలో ఎలాంటి లోపాలు ఉన్నా, మీలో మంచితనపు కాంతిని తెచ్చినప్పుడు మీకు ఇంక అవి ఉండవు. ఆత్మ యొక్క కాంతి జన్మజన్మల చెడు కూడా నాశనం చేయలేనంత గొప్పది. కానీ చెడు యొక్క స్వయం-నిర్మిత తాత్కాలిక అంధకారం ఆత్మను దుఃఖపూరితం చేస్తుంది, ఎందుకంటే మీరు ఆ చీకటిలో బాధపడుతున్నారు కనుక. గాఢమైన ధ్యానంలో మీ ఆధ్యాత్మిక నేత్రాన్ని తెరిచి, మీ చైతన్యాన్ని సర్వమును బహిరంగపరచే దివ్యకాంతితో నింపడం ద్వారా మీరు చీకటిని తరిమికొట్టవచ్చు.

భూమిపై కాంతి ఆత్మ కాంతిని సూచిస్తుంది.మిమ్మల్ని మరెవరూ రక్షించలేరు. మీరు గ్రహించిన వెంటనే మీకు మీరే రక్షకులు:

“నేనే కాంతిని. చీకటి నాకు ఉద్దేశించబడలేదు; అది నా ఆత్మ వెలుగును ఎప్పటికీ మరుగు పరచలేదు.”

ప్రస్తుత దోషాల పీడకలని మరచిపోండి. రాత్రి నిద్రకు ముందు మరియు తెల్లవారుజామున మేల్కొన్నప్పుడు ఇలా ధృవీకరించండి:

“ఏసు క్రీస్తు మరియు గురువులలాగా నేను కూడా దేవుని కుమారుణ్ణి. అజ్ఞానపు తెరమాటున నేను ఆయన నుండి మరుగవను. నేను జ్ఞానంతో ప్రకాశిస్తాను, తద్వారా నేను నిరంతరం పెరుగుతున్న నా ఆధ్యాత్మిక పారదర్శకత ద్వారా ఆయన సర్వోత్తమ కాంతిని పూర్తిగా అందుకుంటాను. ఆయన వెలుగును సంపూర్ణంగా స్వీకరించి, ఆయన స్వరూపంలో సృష్టించబడ్డవాడిగా ఎల్లప్పుడూ నేను దేవుని కుమారుడనని తెలుసుకుంటాను.”

“నేను సర్వదా దేవుని బిడ్డను. నా పరీక్షలన్నింటి కంటే నా శక్తి గొప్పది. గతంలో నేను చేసిన తప్పు పనులు ఏవైనా, ఇప్పటి మంచి చర్యలు మరియు ధ్యానం ద్వారా నేను నిరర్ధకం చేయగలను. నేను వాటిని నాశనం చేస్తాను. నేను నిత్యము అమరుడిని.”

మీరు మీ ప్రాపంచిక ఆలోచనలు మరియు కోరికలన్నింటినీ బహిష్కరించే వరకు ప్రతి రాత్రి ధ్యానం చేయండి….మీ అశాంతి ఆలోచనలు మరియు భావాలన్నింటినీ పక్కనపెట్టి, మీ ఆత్మ యొక్క ఆలయంలో కూర్చోండి, అందులో భగవంతుని యొక్క విస్తారమైన ఆనందం విస్తరించి ఈ ప్రపంచాన్ని చుట్టుముడుతుంది, అది తప్ప మరొకటి లేదని మీరు గ్రహిస్తారు.. అప్పుడు మీరు ఇలా చెబుతారు:

“నేను దేవుని శాశ్వతమైన కాంతితో, క్రీస్తు యొక్క నిత్యమైన ఆనందంతో ఒకటై ఉన్నాను. సృష్టిలోని తరంగాలన్నీ నాలో పొంగుతున్నాయి. నేను నా శరీర తరంగాన్ని ఆత్మ సాగరంలో ముంచాను. నేనే ఆత్మ సముద్రం. ఇక నేను శరీరమును కాదు. నా ఆత్మ రాళ్లలో నిద్రాణమై ఉంది. నేను పువ్వులలో కలలు కంటున్నాను, పక్షులలో నేను పాడుతున్నాను. నేను మనిషిలో ఆలోచిస్తున్నాను, మరియు మానవోత్తమునిలో నేను ఉన్నానని నాకు తెలుసు.

ఈ స్థితిలో అగ్ని కూడా మిమ్మల్ని నాశనం చేయలేదని; భూమి, గడ్డి, ఆకాశం అన్నీ నీ రక్తసంబంధాలే అని మీరు గ్రహిస్తారు. అప్పుడు మీరు భూమిపై ఒక ఆత్మ వలె నడుస్తారు, సృష్టి యొక్క అల్లకల్లోలమైన తరంగాలకు ఇక భయపడకండి.

నువ్వు ప్రేమవి

“నా దివ్యమైన తండ్రి ప్రేమయే, నేను ఆయన ప్రతిరూపంగా తయారుచేయబడ్డాను. అన్ని గ్రహాలు, అన్ని నక్షత్రాలు, అన్ని జీవులు, సృష్టి అంతా మెరుస్తున్న ప్రేమ గోళం నేను. విశ్వమంతటా వ్యాపించి ఉన్న ప్రేమను నేను.”

మీరు ఆ దివ్యమైన ప్రేమను అనుభవించినప్పుడు, పువ్వుకు మృగానికి మధ్య, ఒక వ్యక్తికి మరొక వ్యక్తి మధ్య తేడా మీకు కనిపించదు. మీరు ప్రకృతితో అంతటితో సంభాషిస్తారు, సమస్త మానవాళిని సమానంగా ప్రేమిస్తారు. దేవుని సంతానం, ఆయనలోని మీ సోదర సోదరీమణులను ఒకే జాతిగా చూసి మీరు ఇలా చెప్పుకుంటారు:

మానవులను వర్ణించే పిల్లలు దేవుని పిల్లలు.“దేవుడు నా తండ్రి. నేను ఆయన విస్తారమైన మానవ కుటుంబంలో భాగం. నేను వారిని ప్రేమిస్తున్నాను, ఎందుకంటే వారందరూ నావారు. నా సోదరుడు సూర్యుడు, సోదరి చంద్రిక మరియు నా తండ్రి సృష్టించి తన ప్రాణశక్తిని ప్రవహింపచేస్తున్న అన్ని జీవులను కూడా నేను ప్రేమిస్తున్నాను.”

“భూలోక జననీజనకులైన ఆదాము-అవ్వలకు సంతానంగా, ఆత్మ పరంగా చూస్తే దేవుడే తమ తండ్రిగా జన్మించిన అనేక జాతులైన ఆలివ్, తెలుపు, ముదురు, పసుపు మరియు ఎరుపు అనే అన్ని వర్ణాల వారినందరినీ నా సోదరులుగా నా హృదయంలో వారి నివాసానికి నేను స్వాగతిస్తున్నాను.

“నేను భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశాన్ని నా రక్తసంబంధాలుగా ఆలింగనం చేసుకుంటాను–జీవించే ప్రతి వస్తువుతో పాటూ నా సిరల్లోనూ తిరుగుతున్న ఒకే ఉమ్మడి ప్రాణం. అన్ని జంతువులు, మొక్కలు, ప్రియమైన పరమాణువులు మరియు శక్తులను నా ప్రాణ మందిరంలో ఉంచుతాను; ఎందుకంటే నేనే ప్రేమను, నేనే ప్రాణాన్ని.”

"అదే నీవు"

జ్ఞానం, లేదా నిజమైన జ్ఞానం, ఆత్మ యొక్క “అహం బ్రహ్మాస్మి (నేనే బ్రహ్మ)” లేదా “తత్ త్వం అసి (నువ్వు అది)” యొక్క సాక్షాత్కారం. ధ్యాన భంగిమలో నిటారుగా కూర్చుని, ప్రాణిక ప్రవాహాన్ని కుటస్థ (కనుబొమ్మల మధ్య) వైపుకు నిర్దేశించినప్పుడు, అదే నిజమైన తపస్సు, ఆధ్యాత్మిక నిష్ఠ. ఆ సాధన లోపల ఉన్న దివ్య శక్తిని స్వాధీనం చేసుకుంటుంది.

మీరు శరీరం లేదా మనస్సు కాదని తెలుసుకుని, ఈ ప్రపంచ స్పృహను దాటి, మునుపెన్నడూ లేని ఎరుకతో మీరున్నారని ఎరిగినప్పుడు – ఆ దివ్య చైతన్యమే మీరు. విశ్వంలోని ప్రతిదానికీ మూలాధారమై ఉన్నది మీరే.

మీ ఆత్మను పరమాత్మ నుండి వేరు చేసే పరిమితుల అడ్డుకట్టలను పగులగొట్టండి.

“నేను సముద్రాన్నా? అది చాలా చిన్నది,
అంతరిక్షం యొక్క ఆకాశనీల పరకపై కల మంచు బిందువు.
నేను ఆకాశమునా? అది చాలా చిన్నది,
నిత్యత్వపు హృదయంలో ఒక సరస్సు.
నేను నిత్యత్వమునా? అది చాలా చిన్నది,
పేరులో బంధించారు.
పేరులేని విస్తారమైన ప్రాంతంలో నేను నివసించడానికి ఇష్టపడతాను,
కలలు, పేర్లు, భావనల హద్దులకు ఆవల.
నేనెప్పుడూ ఒకేలా ఉంటాను —
ఎప్పటికీ ఉండే గతంలో,
ఎప్పటికీ ఉండే భవిష్యత్తులో,
ఎప్పటికీ ఉండే వర్తమానంలో ఇప్పుడు.”

గెలాక్సీ దేవుని రాజ్యం యొక్క విశాలతను వర్ణిస్తుంది.

తదుపరి అన్వేషణ:

Share this on