గాడ్ టాక్స్ విత్ అర్జున, హిందీ అనువాదం విడుదల

18 నవంబరు, 2017

నవంబర్ 15, 2017న, భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ గారు, ఝార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ మరియు ముఖ్యమంత్రిగారితో కలిసి, వై.ఎస్.ఎస్. శరద్ సంగమం సందర్భంగా, శ్రీ పరమహంస యోగానందగారి “గాడ్ టాక్స్ విత్ అర్జున: ద భగవద్గీత” హిందీ అనువాదం విడుదలకు హాజరయ్యేందుకు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా, రాంచీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో, శ్రీ స్వామి చిదానంద గిరి ఈ పవిత్రమైన యోగా గ్రంథంపై పరమహంస యోగానందగారి యొక్క వ్యాఖ్యానం మరియు నిజమైన సార్వత్రిక గ్రంథాన్ని వేరుచేసే లక్షణాల గురించి మాట్లాడారు.

భారత రాష్ట్రపతి వై.ఎస్.ఎస్. పర్యటన గురించి చదవండి.

Share this on