"దేవునితో ఏకాంతంగా ఉండడం వల్ల, మీ మనస్సు, శరీరం మరియు ఆత్మలపై కలిగే ప్రభావాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు....నిశ్శబ్దమనే ప్రధాన ద్వారం ద్వారా జ్ఞానము మరియు శాంతి యొక్క స్వస్థత కలిగించే సూర్యుడు మీపై ప్రకాశిస్తాడు."
—శ్రీ శ్రీ పరమహంస యోగానంద
వై.ఎస్.ఎస్. రిట్రీట్ లు మరియు జీవించడం-ఎలా రిట్రీట్ కార్యక్రమాలు

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించే ‘జీవించడం ఎలా’ రిట్రీట్ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక పునరుద్ధరణను కోరుకునేవారికి మరియు దైనందిన జీవితంలోని ఒత్తిళ్లను విడిచిపెట్టాలని కోరుకునే ఎవరికైనా తెరిచి ఉంటాయి – కొన్ని రోజులు మాత్రమే అయినా – దేవునిపై అవగాహనను మరింతగా పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. రోజువారీ రిట్రీట్ కార్యక్రమాల గురించి పరమహంస యోగానందగారి మాటలలో, “అనంతమైన పరమాత్ముడి ద్వారా తిరిగి శక్తివంతము చేయబడే ప్రత్యేక ప్రయోజనం కోసం [మీరు] వెళ్ళే నిశ్శబ్దం అనే డైనమో.”
రిట్రీట్ కార్యకలాపాలు
రిట్రీట్ కార్యకలాపాలలో రోజువారీ సామూహిక ధ్యాన కార్యక్రమాలు, వై.ఎస్.ఎస్. శక్తి పూరణ వ్యాయామాల అభ్యాసం, స్ఫూర్తిదాయకమైన తరగతులు మరియు కార్యక్రమాలు, గురుదేవులపై వీడియొ ప్రదర్శన మరియు వై.ఎస్.ఎస్. ఆశ్రమాలకు దగ్గరలో ఉన్న ప్రదేశాలలో సేవా కార్యక్రమాలు జరుగుతాయి. అందమైన రిట్రీట్ పరిసరాలలో దేవుని సానిధ్యాన్ని ఆస్వాదించడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి తగినంత ఖాళీ సమయం కూడా ఉంటుంది. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా పుస్తకాలు మరియు రికార్డింగ్ లు వ్యక్తిగత అధ్యయనం మరియు శ్రవణం కోసం అందుబాటులో ఉంటాయి మరియు ధ్యానం కోసం రిట్రీట్ ధ్యాన మందిరం తెరిచి ఉంటుంది.
వై.ఎస్.ఎస్. సన్యాసుల నేతృత్వంలో నిర్వహించే వారాంతపు రిట్రీట్ లు వై.ఎస్.ఎస్. బోధనలు మరియు ధ్యాన ప్రక్రియలపై తరగతుల యొక్క కేంద్రీకృత కార్యక్రమాలను అందిస్తాయి. ఏడాది పొడవునా అనేక వారాంతాల్లో జరిగే ఈ కార్యక్రమాలు సౌకర్యవంతమైన వై.ఎస్.ఎస్. రిట్రీట్ కేంద్రాలలోనూ – మరియు భారతదేశంలోని వివిధ ప్రదేశాలలోను నిర్వహించబడతాయి.
రిట్రీట్ ప్రభావాన్ని పూర్తిగా అనుభవించడానికి, అతిధులు రిట్రీట్ కార్యక్రమాలలో పూర్తిగా పాల్గొనవలసి ఉంటుంది మరియు బస చేసే సమయంలో వేరే ఇతర కార్యకలాపాలలో పాల్గొనకుండా ఉండవలసి ఉంటుంది.
ఈ రిట్రీట్ కార్యక్రమాలు భక్తులందరికీ అందుబాటులో ఉంటాయి: పురుషులు, మహిళలు మరియు వివాహిత జంటలు. పురుషులు మరియు మహిళలకు వసతి విడివిడిగా కల్పించడం జరుగుతుంది.
ఈ రిట్రీట్ లలో పాల్గొనేవారు, గురుదేవులతో తమ అనుబంధాన్నీ మరింతగా పెంచుకోవడానికి మరియు తమ అంతరంగ వాతావరణాన్ని నిర్మించుకోవడానికి రిట్రీట్ సమయంలో మౌనంగా ఉండాలని కోరుతున్నాం.
మీరు ఈ రిట్రీట్ కార్యక్రమాలలో దేనిలోనైనా పాల్గొనాలనుకుంటే, దయచేసి మీ పూర్తి పేరు, చిరునామా, టెలిఫోన్ నెంబర్, ఇమెయిల్ ID, పాఠాల రిజిస్ట్రేషన్ నెంబర్, వయస్సు మరియు మీ ప్రతిపాదిత ఆగమన సమయము మరియు నిష్క్రమించే సమయములతో రిట్రీట్ కు కనీసం ఒక నెల ముందు సంబంధిత ఆశ్రమం/కేంద్రం/సాధనాలయమునకు సమాచారాన్ని తెలియజేయండి. మీ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన నిర్ధారణను అప్పుడు మీరు అందుకుంటారు. ముందుగా మీరు చెల్లించవలసిన రిజిస్ట్రేషన్ ఫీజు ఉండవచ్చు. మరిన్ని వివరాల కోసం దయచేసి సంబంధిత ఆశ్రమం/కేంద్రం/సాధనాలయాన్ని సంప్రదించండి.
గురుదేవులు ఇలా అన్నారు: “దేవుణ్ణి స్మరించుకోవడం అన్నిటి కంటే గొప్ప కార్యం. ఉదయం చేయవలసిన మొదటి పని ఏమిటంటే, ఆయనను ధ్యానించడం మరియు ఆయన సేవకు మీ జీవితాన్ని ఎలా ఉపయోగించగలరో ఆలోచించడం, తద్వారా రోజంతా మీరు ఆయన ఆనందంతో నిండిపోతారు.”

రిట్రీట్ కార్యక్రమాలు – 2022
June
Yogoda Satsanga Sakha Ashram — Noida
Paramahansa Yogananda Marg, B – 4, Sector 62, NOIDA – 201307, Dist. Gautambudhanagar, Uttar Pradesh;
Phone: (0120) 2400670, 2400671, 9899811808, 9899811909;
Email: [email protected]
All programmes will be held at: Yogoda Satsanga Sakha Ashram – Noida
July
Yogoda Satsanga Sakha Ashram — Noida
Paramahansa Yogananda Marg, B – 4, Sector 62, NOIDA – 201307, Dist. Gautambudhanagar, Uttar Pradesh;
Phone: (0120) 2400670, 2400671, 9899811808, 9899811909;
Email: [email protected]
All programmes will be held at: Yogoda Satsanga Sakha Ashram – Noida
August
Yogoda Satsanga Sakha Ashram — Noida
Paramahansa Yogananda Marg, B – 4, Sector 62, NOIDA – 201307, Dist. Gautambudhanagar, Uttar Pradesh;
Phone: (0120) 2400670, 2400671, 9899811808, 9899811909;
Email: [email protected]
All programmes will be held at: Yogoda Satsanga Sakha Ashram – Noida
Yogoda Satsanga Math — Dakshineswar
21, U.N. Mukherjee Road, DAKSHINESWAR, Kolkata 700 076, West Bengal;
Phone: (033) 25645931, 256462088420873743, 9073581656;
Email: [email protected]
All programmes will be held at: Yogoda Satsanga Math – Dakshineswar
September
Yogoda Satsanga Math — Dakshineswar
21, U.N. Mukherjee Road, DAKSHINESWAR, Kolkata 700 076, West Bengal;
Phone: (033) 25645931, 256462088420873743, 9073581656;
Email: [email protected]
All programmes will be held at: Yogoda Satsanga Math – Dakshineswar
October
Yogoda Satsanga Dhyana Kendra — Dihika
Near Damodar Rail gate, Damodar, P.O. Surjanagar, Burdwan 713 361, West Bengal;
Phone: 9163146566, 9163146565;
Email: [email protected]
All programmes will be held at: Yogoda Satsanga Dhyana Kendra – Dihika
December
Yogoda Satsanga Dhyana Kendra — Puri
Near Orissa Bakery, Water Works Road, PURI 752 002, Odisha;
Phone: 9778373452, (0675) 2233272;
Email: [email protected]
Additional contact persons: Sri Durga Prasad Pattanayak: 8249701620; Sri Narayan Pasupalak: 8895439287
All programmes will be held at: Yogoda Satsanga Dhyana Kendra – Puri

వై.ఎస్.ఎస్. రిట్రీట్స్:

యోగదా సత్సంగ ఆనంద్ శిఖర్ సాధనాలయ, షిమ్లా
బానోతి పహల్ రోడ్
గ్రామం. పంతి, షిమ్లా 171011
హిమాచల్ ప్రదేశ్
ఫోన్లు: (0177) 6521788, 09418638808, 09459051087
ఇ-మెయిల్: [email protected]gmail.com
ఎలా చేరుకోవాలి

వై.ఎస్.ఎస్. చెన్నై రిట్రీట్
గ్రామం. మన్నూరు, P. O. వల్లార్పురం
తాలూకా శ్రీపెరంబుదూర్
జిల్లా. కాంచీపురం 602105, తమిళనాడు
ఫోన్లు: 09444399909, 09600048364, 08939281905
ఇ-మెయిల్: [email protected]
ఎలా చేరుకోవాలి

యోగదా సత్సంగ సరోవర్ సాధనాలయ – పూణే
పాన్‌షెట్ డ్యామ్‌కు 12వ కిలోమీటర్ మైలురాయి,
పాన్‌షెట్ రోడ్, ఖానాపూర్ గ్రామం
నంద్ మహల్ ఎదురుగా, శాంతివన్ రిసార్ట్ కి ఒక స్టాప్ ముందు
ఖానాపూర్ గ్రామం నుండి 2.5 కి.మీ
జిల్లా. పూణే, మహారాష్ట్ర
ఫోన్లు: 09850883124, 09850885228
ఇ-మెయిల్: [email protected]
ఎలా చేరుకోవాలి

పరమహంస యోగానంద సాధనాలయ, ఇగత్పురి
పరమహంస యోగానంద పథ్
యోగానందపురం
ఇగత్పురి 422403
జిల్లా. నాసిక్, మహారాష్ట్ర
ఫోన్లు: 09226618554, 09823459145
ఇ-మెయిల్: [email protected]
ఎలా చేరుకోవాలి

యోగదా సత్సంగ ధ్యాన కేంద్రం – దిహికా
దామోదర్ రైల్ గేట్ దగ్గర
దామోదర్
పి.ఓ. సుర్జానగర్
జిల్లా. బుర్ద్వాన్ 713361
పశ్చిమ బెంగాల్
ఫోన్లు: 09163146565, 09163146566
ఇ-మెయిల్: [email protected]
ఎలా చేరుకోవాలి

యోగదా సత్సంగ ధ్యాన కేంద్రం – పూరి
ఒడిషా బేకరీ దగ్గర
వాటర్ వర్క్స్ రోడ్
పూరి 752002
ఒడిషా
ఫోన్లు: (06752) 233272, 09778373452
ఇ-మెయిల్: [email protected]
ఎలా చేరుకోవాలి

యోగదా సత్సంగ ధ్యాన కేంద్రం – సెరంపూర్
57, నేతాజీ సుభాస్ అవెన్యూ
సెరంపూర్ 712201
జిల్లా. హుగ్లీ
పశ్చిమ బెంగాల్
ఫోన్లు: (033) 26626615, 08420061454
ఇ-మెయిల్: [email protected]
ఎలా చేరుకోవాలి

యోగదా సత్సంగ ధ్యాన కేంద్రం – తెలరీ
గ్రామం తెలరి
బహిర్కుంజా 743318
జిల్లా. సౌత్ 24 పరగనాస్
పశ్చిమ బెంగాల్
ఫోన్: 09831849431
ఇ-మెయిల్: [email protected]
ఎలా చేరుకోవాలి

యోగదా సత్సంగ ధ్యాన కేంద్రం – కోయంబత్తూరు
పెర్క్స్ స్కూల్ క్యాంపస్
తిరుచ్చి రోడ్, బృందావన్ కాలనీ
సింగనల్లూర్, కోయంబత్తూర్ 641015
తమిళనాడు
ఫోన్లు: 09080675994, 09843179177, 09663949127
ఇ-మెయిల్: [email protected]
ఎలా చేరుకోవాలి
ఈ రిట్రీట్ కార్యక్రమాలు భక్తులందరికీ అందుబాటులో ఉంటాయి: పురుషులు, మహిళలు మరియు వివాహిత జంటలు. పురుషులు మరియు మహిళలకు వసతి విడివిడిగా కల్పించడం జరుగుతుంది. 65 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయస్సుగల భార్యాభర్తలకు కొన్ని మినహాయింపులు ఉండవచ్చు.