2011 సంవత్సరం, ఆధునిక ప్రపంచంలో క్రియాయోగం యొక్క 150వ వార్షికోత్సవాన్ని గుర్తు చేస్తుంది. గుప్తమైన హిమాలయ గుహలో తన ప్రయాణాన్ని ప్రారంభించి, ఆత్మ విమోచన ప్రక్రియలలో అత్యున్నతమైన ఈ ప్రక్రియ అన్ని దేశాలకు వ్యాప్తి చెందుతున్నది, ప్రతి చోటా దైవాన్వేషకులు దేవునితో ప్రత్యక్ష వ్యక్తిగత అనుసంధానం కలిగించే దిశగా, అతి వేగంగా ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి సహాయం చేస్తోంది.
క్రియాయోగం యొక్క స్వభావం, పాత్ర, సామర్థ్యం మరియు మోక్షానికి సర్వోత్తమమైన ప్రక్రియగా పరమహంస యోగానందగారి సంభాషణల నుండి ఎంపిక చేయబడిన ఈ సంకలనం తెలియజేస్తుంది. ప్రస్తుత యుగానికి భగవంతుడు మరియు మహాగురువులు భూమికి పంపబడిన ప్రత్యేకమైన విధి ఈ క్రియాయోగ ప్రక్రియ.
150 సంవత్సరాల క్రితం: ఆధునిక కాలానికి యోగము యొక్క పునరుజ్జీవనం
తాము ఈ భూమి మీద మళ్ళీ అవతరించడానికి గల ప్రయోజనం నెరవేరడం లాహిరీ మహాశయులు చూసింది ముప్ఫై మూడో ఏట. హిమాలయాల్లో రాణీఖేత్ సమీపంలో తమ మహోన్నత గురువులు బాబాజీని కలుసుకొని, వారి దగ్గర క్రియాయోగ దీక్ష పొందారు.
ఈ శుభ సంఘటన జరిగింది లాహిరీ మహాశయులు ఒక్కరికే కాదు; మానవజాతి కంతటికీ సౌభాగ్య సమయమది. వాడుకలో లోపించి లేదా చిరకాలంగా అదృశ్యమై ఉన్న సర్వోన్నత యోగవిద్యను మళ్ళీ వెలుగులోకి తెచ్చిన శుభతరుణమది.
పురాణ కథలో దాహార్తుడైన భగీరధుడనే భక్తుడి కోసం గంగ, ఆకాశం నుంచి భూమికి దిగివచ్చి దివ్యజలాలందించినట్టు, 1861లో క్రియాయోగమనే స్వర్గంగ, హిమాలయ రహస్య గహ్వరం నుంచి సామాన్య జనపదాలకు ప్రవహించడం మొదలుపెట్టింది.
ఒక ప్రాచీన శాస్త్రం
ప్రస్తుత ప్రపంచ యుగానికి ప్రత్యేక విధి
ఆధ్యాత్మిక యుగం నుండి భౌతిక యుగంలోకి మానవుని యొక్క అవరోహణం జరిగినప్పుడు, యోగ శాస్త్రం యొక్క జ్ఞానం క్షీణించి మరుగవుతుంది… మరొక్కసారి ఈ ఆరోహణ, అణుయుగంలో రాజయోగము యొక్క నాశరహితమైన శాస్త్రం క్రియాయోగముగా మహావతార్ బాబాజీ, శ్యామా చరణ్ లాహిరీ మహాశయులు, స్వామి శ్రీ యుక్తేశ్వర్ మరియు వారి శిష్యుల కృప వల్ల పునరుద్ధరించబడుతోంది….
ప్రత్యేక దైవికమైన విధి విషయమై, కృష్ణుడు, క్రీస్తు, మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయులు, మరియు స్వామి శ్రీ యుక్తేశ్వర్ ద్వారా యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా బోధనలలో సూచించబడిన కృష్ణుని నిజమైన యోగం మరియు క్రీస్తు యొక్క నిజమైన క్రైస్తవ మతం యొక్క ఐక్యతను, క్రియాయోగ శాస్త్రం ద్వారా ప్రపంచమంతటా వ్యాప్తి చేయడానికి నేను ఎంపిక చేయబడ్డాను.
మహావతార్ బాబాజీ (పరమాత్మలో కృష్ణుడితో సమానమని నేను ఎప్పుడూ గ్రహిస్తాను) మరియు క్రీస్తు మరియు నా గురువు మరియు పరమగురువుల నిదర్శనం మరియు ఆశీస్సుల ద్వారా నేను పశ్చిమ దేశాలకు పంపబడి, క్రియాయోగ శాస్త్ర పరిరక్షణకు మరియు ప్రపంచములో వ్యాప్తి చేయడానికి, ఒక సాధనముగా సేవ చేయడానికి, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాను స్థాపించే పనిని చేపట్టాను.
తూర్పున యోగమునకు దైవ నిదర్శనముగా కృష్ణుడు నిలుస్తాడు; భగవంతుడు పశ్చిమానికి దైవసంయోగానికి నిదర్శనముగా క్రీస్తును ఎంచుకున్నాడు. ఆత్మను పరమాత్మతో ఐక్యం చేసే రాజయోగ ప్రక్రియ ఏసుకు తెలిసి, ఆయన శిష్యులకు బోధించారని బైబిల్ లోని లోతైన ప్రతీకాత్మక అధ్యాయం “ద రెవలేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు సెయింట్ జాన్”* లో నిరూపించబడింది.

బాబాజీకి క్రీస్తుతో ఎప్పుడూ సన్నిహిత సంబంధముంటూనే ఉంది. వీరిద్దరూ కలసి ముక్తిప్రదమైన స్పందనలను ప్రసరింపజేస్తూనే ఉంటారు. అంతే కాకుండా వీరు, ఈ యుగంలో మోక్షప్రాప్తి కోసం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియకు రూపకల్పన చేశారు.
దురభిమాన సిద్ధాంతం మీద కాకుండా, క్రియాయోగం సత్యం మీద దృష్టిని కేంద్రీకరిస్తుంది

భగవద్గీత భారతదేశం యొక్క అత్యంత ప్రియమైన యోగ గ్రంథం, దైవసంయోగ శాస్త్రం – మరియు రోజువారీ జీవితంలో సంతోషం మరియు సమతుల్య విజయానికి సనాతనమైన విధి. గీతపై పరమహంస యోగానందగారి విస్తారమైన సమగ్ర రచన, గాడ్ టాక్స్ విత్ అర్జున: ద భగవద్గీత – రాయల్ సైన్స్ ఆఫ్ గాడ్‑రియలైజేషన్ (రెండు సంపుటాలు; యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా, లాస్ ఏంజిలిస్)గా పేర్కొనబడింది. ఆయన ఇలా వ్రాశారు: “నా గురువు మరియు పరమగురువులు – స్వామి శ్రీ యుక్తేశ్వర్, లాహిరీ మహాశయులు, మరియు మహావతార్ బాబాజీ – ఈ ప్రస్తుత యుగానికి చెందిన ఋషులు, గురువులు, వారికి వారే భగవత్సాక్షాత్కారం పొందిన సజీవ గ్రంథాలు. చిరకాలంగా అదృశ్యమైన క్రియాయోగ శాస్త్రీయ ప్రక్రియతో పాటు పవిత్ర భగవద్గీత యొక్క – ప్రధానంగా యోగ శాస్త్రానికి మరియు ముఖ్యంగా క్రియాయోగమునకు సంబంధించిన కొత్త నిదర్శనాన్ని ప్రపంచానికి అందించారు.




ప్రాణాయామం యొక్క క్రియాయోగ శాస్త్రం (ప్రాణశక్తి నియంత్రణ)


క్రియాయోగ సాధన, ప్రశాంతతని మరియు ఆనందాన్ని ప్రసాదిస్తుంది



సహజమైన అంతర్గత మార్గదర్శకత్వాన్ని క్రియ మేల్కొల్పుతుంది

1946లో పరమహంస యోగానందగారి ఒక యోగి ఆత్మకథ ప్రచురణతో క్రియయోగ శాస్త్రం గురించి మొదటగా ప్రపంచ ప్రజలకు తెలియవచ్చింది. ఈ పుస్తకంలో, సంవత్సరాల క్రితం ఆయన తన గురువుగారితో చేసిన ఈ క్రింద సంభాషణను వివరించారు:
అసాధారణమైన గాంభీర్యంతో శ్రీ యుక్తేశ్వర్ గారు ఇలా అన్నారు, “యోగానందా, పుట్టినప్పటి నుండి నీ చుట్టూ, లాహిరీ మహాశయుల ప్రత్యక్ష శిష్యులు ఉంటూ వచ్చారు. ఆ మహాగురువులు, మహిమాన్వితమైన తమ జీవితం కొంతవరకు ఏకాంతంలో గడిపారు, పైగా, తమ ఉపదేశాల ప్రచారం కోసం ఎటువంటి సంస్థ నెలకొల్పడానికయినా ఆయన గట్టిగా అనుమతి నిరాకరిస్తూ వచ్చారు. అయినప్పటికీ విశిష్టమైన జోస్యం ఒకటి చెప్పారు.
“’నేను పోయిన సుమారు ఏభై ఏళ్ల తరువాత, పడమటి దేశాల్లో యోగవిద్య పట్ల కలుగబోయే గాఢమైన ఆసక్తి కారణంగా, నా జీవిత వృత్తాంతం ఒకటి వ్రాయడం జరుగుతుంది. యోగవిద్యా సందేశం భూగోళాన్ని చుట్టేస్తుంది. సర్వమానవ సోదరత్వాన్ని, అంటే మానవజాతి ఏకైక పరమపిత ప్రత్యక్ష దర్శనంమీద ఆధారపడ్డ ఐకమత్యాన్ని నెలకొల్పడానికి తోడ్పడుతుందది,’ అని చెప్పారు.
“నాయనా, యోగానందా, ఆ సందేశాన్ని వ్యాప్తి చెయ్యడంలోనూ, ఆయన పవిత్ర జీవితాన్ని గురించి వ్రాయడంలోనూ నీ వంతు పని నువ్వు చెయ్యాలి,” అని శ్రీ యుక్తేశ్వర్ గారు అన్నారు.
1895లో లాహిరీ మహాశయులు పోయిన తరవాత, ఈ పుస్తకం పూర్తయిన 1945 సంవత్సరానికి మధ్య ఏభై ఏళ్ళు గతించాయి. పైగా ఈ 1945 సంవత్సరమే యాదృచ్ఛికంగా, విప్లవాత్మకమైన అణుశక్తుల నూతన యుగాన్ని కూడా ప్రవేశపెట్టడం గమనించి చకితుణ్ణి కాకుండా ఉండలేను. ఆలోచనాశీలమైన మనస్సులన్నీ ఇప్పుడు, ముందెన్నడూ లేనంతగా ప్రత్యేకించి శాంతి సోదరత్వాల తక్షణ సమస్యల వైపు మళ్లుతున్నాయి.





పరిపూర్ణమైన ప్రేమను కనుగొనడం
ధ్యానంలో దేవునితో అనుసంధానం పొందడం ద్వారా అతి గొప్ప ప్రేమను అనుభవించగలుగుతారు. ఆత్మ మరియు పరమాత్మల మధ్య ప్రేమ పరిపూర్ణమైనది, మీరందరూ కోరుకునే ప్రేమ….మీరు గాఢంగా ధ్యానం చేస్తే, ఏ మానవ జిహ్వ కూడా వర్ణించలేని విధంగా మీరు ఒక ప్రేమను పొందుతారు, మరియు ఆ స్వచ్ఛమైన ప్రేమను మీరు ఇతరులకు ఇవ్వగలుగుతారు….మీరు ఆ దివ్యప్రేమను అనుభవించినప్పుడు పువ్వుకి మరియు పశువుకి మధ్య, ఒక మనిషికి మరియు మరొక మనిషికి మధ్య తేడా మీకు కనిపించదు. మీరు ప్రకృతి అంతటితోను సంభాషిస్తారు, మరియు మీరు మానవులందరినీ సమానంగా ప్రేమిస్తారు.