మత నాయకులు

"1935లో నేను శ్రీ పరమహంస యోగానందగారిని కలకత్తాలో కలిశాను. అప్పటి నుండి అమెరికాలో వారు చేపడుతున్న కార్యక్రమాలను తెలుసుకుంటున్నాను. ప్రపంచములో యోగానందగారి సన్నిధి చిమ్మచీకటిలో గొప్ప తేజోవంతమైన వెలుగులాంటిది. నిజమైన అవసరం ఉన్నప్పుడు మాత్రమే, అరుదుగా అటువంటి మహాత్ముడు భూమిపై అవతరిస్తాడు."

కంచి కామ కోటి పీఠాధిపతి, శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వాములు

"[పరమహంస యోగానందగారి] ఒక యోగి ఆత్మకథ అనేక సంవత్సరాలుగా అగ్రశ్రేణిలో అమ్ముడు పోవుతున్న గొప్ప గ్రంథము. ప్రపంచములో వారు స్థాపించిన “సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రాలు” నిజమైన సత్యాన్వేషకులకు మంచి ఆధ్యాత్మిక కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. 1950లో లాస్ ఏంజిలిస్ లోని సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ కేంద్రములో వారిని నేను కలిసినప్పుడు, నేను పొందిన అనుభవము నాకు ఇప్పటికి జ్ఞప్తికి ఉంది...ఆయన నిజమైన దేవ ధూతగా, ఆయన జగద్రక్షకుడుగా, ఒక ముక్తి ప్రదాతగా నాకు అనిపించింది. వదులుగా ఉండే కాషాయ వస్త్రము ఆయన బలమైన శరీరాన్ని కప్పి ఉంది. ఆయన దివ్య సన్నిధి ఆ గదిని పూర్తిగా సమ్మోహనశక్తితో నింపింది. విశ్వానందముతో ఆయన ఊగిసలాడుతున్నట్లు అనిపించింది. ఇహ లోకానికి సంబంధించని శాంతి ఆయనను ఆవరించి ఉంది. దైనందిన జీవితంలో మనము చూసే ప్రశాంతత కంటే గొప్ప ప్రశాంతత ఆయన సన్నిధిలో ఉంది. ఆయన ఇంత గొప్పగా ఎట్లు ప్రసిద్ధి చెందారో నాకు తెలిసింది....

"ఆయన విజయానికి పేరు ప్రతిష్టలకు కారణము ఆయన ముఖ వర్చస్సు కాదు – ఏదో ఒక తెలియని రహస్యమున్నది. ప్రస్తుతం బహుళ ప్రచారంలో నున్న హఠ యోగంతో బాటు పోటీపడుతూ ప్రజాదరణ పొందుచున్నది విశ్వజనీనమైన క్రియాయోగము మాత్రమే!"

— డా|| మార్కస్ బా, గ్రంథకర్త-విద్యావేత్త, మతాధికారి యునైటెడ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్

“నేను రెండు విశ్వవిద్యాలయాలలో, రెండు సెమిస్టర్లలో నేర్చుకున్న చదువు కంటే ఒక వారము రోజులు స్వామి యోగానందగారి శిక్షణలో నిజమైన విద్యను నేర్చుకున్నాను. ఇది గగుర్పాటు కలిగించే నిగూఢ రహస్యాలను ప్రకటించిన గొప్ప శిక్షణవలే నాకు తోచింది. సాక్షాత్కారానికి, వ్యాఖ్యానాలకు మధ్య గల అంతరాన్ని నేను తెలుసుకున్నాను. క్రీస్తువలే సత్యాన్ని ప్రత్యక్షంగా దర్శిస్తున్న, దర్శింపచేస్తున్న గొప్ప జగద్గురువు పరమహంసగారు. వీరి వద్ద నా సోదర మతాచార్యులు కూడా శిక్షణ పొందడము అవసరమని నేను భావిస్తున్నాను.”

— రెవరెండ్ ఆర్థర్ పోర్టర్, M.A., D.D., మత బోధకుడు, కాంగ్రిగేషనల్ చర్చ్, లండన్

“దేశాలు, మనుషుల మధ్య శాంతిని నెలకొల్పుటకు, మానవుల మానసిక రోగాలను మాన్పుటకు భూమిపై గాని, స్వర్గములో గాని ఏదైనా శక్తి ఉందంటే – అది పరమహంస యోగానందవారి బోధనలలో ఉంది.”

— రెవరెండ్ ఎడ్వర్డ్. ఎ. లాహ్ మన్ క్లీవ్ ల్యాండ్, ఓహియో

“శ్రీ శ్రీ పరమహంస స్థాపించిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా మరియు సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రాలలో సర్వోన్నత ఆధ్యాత్మిక చింతన, ప్రేమ, సేవ మొదలైన లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.”

పూరి శంకరాచార్యులు, శ్రీ శ్రీ భారతి తీర్థ స్వాములు

“ప్రపంచము ఇంతవరకు చూడని, వెలకట్టలేని జాతిరత్నము వంటి వారు శ్రీ శ్రీ పరమహంసగారు. మునులు, మహర్షులే భారతదేశ నిజమయిన సంపద. ఈ సంపదకు నిజమయిన ప్రతినిధి శ్రీ శ్రీ పరమహంస యోగానంద స్వామి.

“వీరు ఆధ్యాత్మిక రంగంలో చేసిన కృషి ఎనలేనిది. మనుష్యులలో నిద్రాణమై ఉన్న ఆధ్యాత్మిక డైనమోను కార్యోన్ముఖం గావించి, అందరి ఆధ్యాత్మిక అభివృద్ధికి సేవలందించారు. వేదాలు, ఉపనిషత్తులే సనాతన ధర్మానికి మూలము. వీటి నుండి ప్రవహించుచున్న అవధులు లేని జ్ఞానామృతాన్ని భగవంతుని బిడ్డలందరు ఆస్వాదించుటకు శ్రీ శ్రీ పరమహంసగారు గొప్ప అవకాశమును కల్పిస్తున్నారు.

“ప్రపంచం నలుమూలల ఉన్న యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రాలు యోగానందగారి కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. ఆ కేంద్రాలు సర్వతోముఖవ్యాప్తి చెందుతాయి; అవి గొప్ప ఆధ్యాత్మిక అయస్కాంత వలయముగా ఏర్పడి ప్రపంచానికి శాంతి సౌభాగ్యాలనందిస్తాయి.”

— స్వామి శివానంద, ది డివైన్ లైఫ్ సొసైటీ, ఋషికేష్, ఇండియా

Share this on