ఒక యోగి ఆత్మకథ ఎం‌పి3 సంచిక

సంపూర్ణ ఆడియో పుస్తకము ఎం‌పి3 సంచిక

ప్రపంచవ్యాప్తంగా ఒక ఆధ్యాత్మిక నిధిగా అభినందించబడిన, అత్యధికంగా విక్రయించబడుతున్న ఈ గ్రంథం, ఒక కొత్త మరియు అత్యంత సఫలమైన జీవన విధానాన్ని పరివర్తన దిశలో వ్యక్తిగత ప్రయాణం ప్రారంభించేందుకు లక్షలాది ప్రజలకు ప్రేరణనిచ్చింది. పరమహంస యోగానందగారి అసాధారణమైన జీవిత చరిత, జ్ఞానము, హాస్యము మరియు స్ఫూర్తితో వాడుక భాషలో అద్భుతముగా తెలియజేయబడింది.

క్రొత్తగా ఈ పుస్తకమును చదివినవారు, అలాగే ఈ పుస్తకాన్ని సుదీర్ఘకాలం విలువైన సహవాసిగా చేసుకున్నవారు, ఈ ప్రఖ్యాత బ్రిటిష్ నటుడు సర్ బెన్ కింగ్ స్లే గారి సున్నితమైన మరియు నిర్భంధింపజేయు పఠనమును తప్పకుండా ఆదరిస్తారు. ఆయన సరళమైన నాటకీయతతో శ్రీ యోగానందగారి అనేకమైన మనోరంజక వృత్తాంతముల శోభను సంగ్రహించారు, రచయిత కళ్ళకు కట్టినట్లుగా వివరించిన మనుషుల ఘనమైన అనుభవాలకు, సంఘటనలకు, మరియు ఆయన ప్రకాశవంతమైన అన్వేషణలకు, జీవితము యొక్క నిగూఢమైన మర్మములకు జీవము పోసి స్పష్టముగా తెలియచేశారు.

ఒక యోగి ఆత్మకథ ఆడియో పుస్తకం

శ్రవణ సమయం: 18 గంటలు (సుమారుగా)

సర్ బెన్ కింగ్ స్లే గురించి

బెన్ కింగ్ స్లే

సర్ బెన్ కింగ్ స్లే గారు గాంధీ శీర్షిక పాత్రలో అకాడమీ అవార్డు గెలుచుకునే అభినయంతో అంతర్జాతీయ ప్రాముఖ్యత పొందారు. కింగ్ స్లే గారు ప్రపంచంలోని గొప్ప మతాలపై సిరీస్ తో సహా, ‘టేప్’ పుస్తకాలను ప్రేరణ కలిగించేలా పఠించినందుకు కూడా ప్రసిద్ధులయ్యారు.

Share this on