
క్రియాయోగ ధ్యాన శాస్త్రాన్ని ఎలా అభ్యసించాలో శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు ముప్పై సంవత్సరాలకు పైగా ఇచ్చిన తరగతుల నుండి తీసుకోబడిన వారి వ్యక్తిగత సూచనలు, యోగదా సత్సంగ పాఠాలలో వివరంగా అందించబడ్డాయి.
వీటికి అదనంగా, పాఠాలు సమతుల్య శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును పొందడానికి, వారి ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని మరియు పద్ధతులను అందిస్తాయి – ఆరోగ్యం, స్వస్థత, సఫలత, మరియు సామరస్యం, ఇలా జీవితంలోని ప్రతి అంశాన్ని యోగము ప్రసాదిస్తుంది. “ఎలా జీవించాలి” అనే ఈ సూత్రాలు ఎలాంటి నిజమైన విజయవంతమైన ధ్యాన సాధనకైనా ఖచ్చితంగా ఆవశ్యకమైన ముఖ్యమైన భాగం.
మీరు ఇంకా పాఠాల కోసం నమోదు చేసుకోనట్లయితే, ధ్యానం ఎలా చేయాలనే దానిపై కొన్ని ప్రాథమిక సూచనలను ఈ పేజీలలో కనుగొంటారు. వాటిని వెంటనే ఆచరణలో పెట్టి ధ్యానం వల్ల కలిగే శాంతిని మరియు దైవంతో అనుసంధానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవచ్చు.
ధ్యానం యొక్క ప్రాథమిక అంశాలపై తదుపరి సూచనలు

సరైన ఆసనం