క్రిస్మస్ 2013

“మీ చైతన్యం అనంత శిశువైన క్రీస్తును పట్టుకునేంత పెద్దది కావటానికి
వీలుగా అన్ని పరిమితులను అధిగమించండి.”
                                                                         —శ్రీ పరమహంస యోగానంద

గురుదేవులు పరమహంస యోగానందగారి ఆశ్రమాలలో ఉన్న మా అందరి నుండి హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు, మరియు ప్రియమైన ప్రభువైన ఏసు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పవిత్ర కాలంలో, మీ భక్తి మరియు ధ్యానంతో శ్రుతి చెందిన చైతన్యం ద్వారా, అతని జీవితంలో విస్తరించిన అనంతమైన క్రీస్తు-ప్రేమను మీరు అనుభవించాలని ప్రార్థిస్తున్నాము. ఎప్పుడైతే హృదయం మరియు మనస్సు ఆయన కాంతిని పూర్తిగా ప్రతిబింబించగలిగే వారి ద్వారా మనకు వచ్చే దైవ స్పర్శకు తెరుచుకుంటుందో, అప్పుడు మనల్ని దివ్యత్వం నుండి వేరుచేసే భ్రాంతిజనకమైన తెర తొలగిపోతుంది. ఈ కలహాలతో విచ్చిన్నమైన ప్రపంచపు చీకటి తొలగిపోయి శాంతి మన ఉనికిని నింపుతుంది. మన సత్యమైన, అపరిమితమైన స్వభావం యొక్క ఆత్మ-జ్ఞాపకంతో పాటుగా మనలో కొత్త ఆశను రేకెత్తిస్తుంది. సార్వత్రిక క్రీస్తు స్పృహ యొక్క ఎప్పటికప్పుడు పునరుద్ధరించబడిన బహుమతులు అలాంటివి.

ఏసు యొక్క విజయవంతమైన జీవితం మనలో ధైర్యాన్ని మరియు విశ్వాసాన్ని రేకెత్తించడానికి ఉద్దేశించబడింది, దేవుని ఆశీర్వాదం మరియు మన అంతః గ్రహణశక్తి ద్వారా మేల్కొలపడానికి మనలో వేచి ఉన్న దివ్య చైతన్యాన్ని మనం కూడా వ్యక్తపరచగలము. వ్యక్తుల హృదయాలు మారుతున్న కొద్దీ, ప్రేమ మరియు సత్యం అనే నియమాలపై తమ జీవితాలను ఆధారం చేసుకునే వారి ప్రభావం మరియు ఉత్తేజకరమైన ప్రకంపనల ద్వారా మానవజాతి యొక్క చైతన్యం కూడా మారుతుంది. ఏసులో అవతరించిన అనంతమైన క్రీస్తును స్వీకరించి మన చైతన్యాన్ని విస్తరింపజేయటం ద్వారా మనలో ప్రతి ఒక్కరికి ఆ పరివర్తనలో పాత్ర ఉంటుంది. మన మనస్సు మరియు హృదయంలో తప్ప మనకు మరియు విశ్వవ్యాప్త క్రీస్తు ఉనికికి మధ్య ఎటువంటి అవరోధాలు లేవు. “క్రీస్తు మీ స్పృహలోకి రావాలని మీరు కోరుకుంటే, మీరు అన్ని అడ్డంకులను కూలగొట్టాలి” అని గురుదేవులు మాకు చెప్పారు. మీ చైతన్యపు విస్తారమైన విస్తీర్ణం నుండి మాయ, అహంకార భయాలు మరియు పక్షపాతాలచే నిర్మించబడిన అడ్డంకులను తొలగించడానికి మీరు ఎంచుకోగల విముక్తిదాయకమైన ఆలోచనలను మీ క్రిస్మస్ సన్నాహాల్లోకి తీసుకోండి. మన మనస్సులో ద్వేషాలు, విమర్శనాత్మక లేదా స్వార్థపూరిత ఆలోచనలను తొలగించి, ఏసు వ్యక్తపరచిన కరుణ మరియు సంఘటిత స్ఫూర్తిని, బయటి గుర్తింపు కోరుకోని వినయాన్ని మరియు తీవ్రమైన పరీక్షల మధ్య శత్రుత్వం అంటకుండా ఆయనను ఉంచిన సర్వ-దయార్ధ్రమైన ప్రేమను మనం గ్రహించినప్పుడు ఎంతో స్వస్థత చేకూరుతుంది. ఆత్మవిముక్తికి దారితీసే లక్షణాలను మీరు పెంపొందించుకున్నప్పుడు, క్రిస్మస్ యొక్క నిజమైన ఆత్మ అయిన క్రీస్తు-ప్రేమ మరియు క్రీస్తు-శాంతి మీ హృదయంలోకి ప్రవేశించడానికి మీరు అనుమతిస్తారు.

ఏసు తెలిసి ఉన్న అత్యున్నతమైన దైవానుభవం అంతః సంసర్గపు గాఢమైన నిశ్శబ్దంలో వెల్లడి అవుతుంది. అపరిమితమైన ప్రేమ హృదయంలో ఉప్పొంగడం ప్రారంభమవుతుంది, పట్టి ఉంచలేని ఆ ప్రేమ విస్తృతమై మన స్వంత వాటిగా అన్ని ఆత్మలను ఆవరించి పొంగిపొర్లుతుంది. ఆ ఏకత్వపు అవగాహన మనలో ప్రతి ఒక్కరికి దేవుడు అందించే అత్యున్నతమైన బహుమతి. సార్వత్రికమైన క్రీస్తును మీ ఆత్మ దేవాలయంలో స్వీకరించి, ఆలోచనలో మరియు చర్యలో ఆయనను గౌరవిస్తుండగా, మీ జీవితంలో క్రిస్మస్ ఆనందం సంపూర్ణంగా నిత్యమూ పెరుగుతున్న క్రీస్తు ఉనికి యొక్క అవగాహనగా కొత్త సంవత్సరంలోని అన్ని రోజులు మీతో ఉండుగాక.

మీకు మరియు మీ ప్రియమైన వారికి శుభకరము మరియు సంతోషకరమైన క్రిస్మస్,

శ్రీ మృణాళినీమాత

కాపీరైట్ © 2013 సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్. అన్ని హక్కులూ ఆరక్షితమైనవి.

Share this on