భారత పర్యటనకు రానున్న వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు

2 ఆగష్టు, 2022

స్వామి-చిదానంద-గిరి-భారత-పర్యటన

గౌరవనీయులైన మన అధ్యక్షులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి జనవరి-ఫిబ్రవరి 2023లో భారతదేశాన్ని సందర్శించుటకు యోచిస్తున్నారని తెలియజేయుడం మాకు చాలా సంతోషాన్నిస్తోంది. ఈ కాలంలో స్వామీజీ మన వై.ఎస్.ఎస్. ఆశ్రమాలను సందర్శిస్తారు మరియు 2023 ఫిబ్రవరి 12 నుండి 16 వరకు హైదరాబాద్ లో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి నాయకత్వం వహిస్తారు. హైదారాబాద్ లో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులందరికీ స్వాగతం. ఈ కార్యక్రమం యొక్క పూర్తి వివరాలను మరియు నమోదు ప్రక్రియను ఖరారు చేసిన వెంటనే మేము మీకు తెలియజేస్తాము.

దయచేసి గమనించండి: హైదరాబాద్ లో జరిగే ఈ కార్యక్రమం మరియు అందులో అధ్యక్షులవారు పాల్గొనడం అనేది, కార్యక్రమానికి ముందు అమలులో ఉన్న కోవిడ్ ప్రయాణ పరిమితులు మరియు భద్రతా నిర్వహణ నియమాలపై ఆధారపడి ఉంటుంది.

 

Share this on