Menu Close

శ్రీ శ్రీ మృణాళినీమాత 70వ వార్షికోత్సవం

17 జూన్, 2016

జూన్ 10, 2016, మన గౌరవనీయ సంఘమాత మరియు అధ్యక్షురాలు, శ్రీ శ్రీ మృణాళినీమాతగారు, భగవంతుడు మరియు గురువు యొక్క ప్రేమ మరియు సేవకు తన జీవితాన్ని అంకితం చేయడానికి పరమహంస యోగానందవారి ఆశ్రమంలోకి ప్రవేశించిన రోజుకి డెబ్భై ఏళ్ళు పూర్తయ్యాయి. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్‌కు గత ఐదేళ్లలో ఆధ్యాత్మిక అధిపతిగా (శ్రీ శ్రీ దయామాత పరమపదించినప్పటి నుండి) మరియు అంతకు ముందు నలభై సంవత్సరాలకు పైగా వైస్-ప్రెసిడెంట్ మరియు ముఖ్య సంపాదకురాలిగా, మృణాళినీమాతగారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వై‌.ఎస్‌.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. సభ్యులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ప్రేమను పంచుతూ మరియు దేహము, మనస్సు, హృదయం మరియు ఆత్మ యొక్క సంపూర్ణ అంకితభావంతో సేవలందించారు.

శ్రీ మృణాళినీమాతకు 1946లో పరమహంస యోగానందగారిచే సన్యాసినిగ ఆశ్రమ శిక్షణకు అంగీకరించబడినప్పుడు కేవలం పదిహేనేళ్లు మాత్రమే. ఆమె 1945లో ఎస్‌.ఆర్‌.ఎఫ్. శాన్ డియాగో ఆలయంలో గురుదేవులను కలిసినప్పుడు, రాబోయే సంవత్సరాల్లో ఆయన కృషిలో ఆమెను కీలక పాత్ర పోషించే వ్యక్తిగా ఆయన గుర్తించారు. ఆ విధంగా, ఆమె తల్లిదండ్రుల అనుమతితో, జూన్ 10, 1946న, ఎన్సినీటస్‌లోని ఎస్‌.ఆర్‌.ఎఫ్. ఆశ్రమంలో నివసించడానికి వచ్చారు. అక్కడ ఆమె ఉన్నత పాఠశాల చివరి సంవత్సరాలను పూర్తి చేశారు మరియు అదే సమయంలో పరమహంసగారి వ్యక్తిగత మార్గదర్శకత్వం పొందారు.

ఈ శిష్యురాలి గత జన్మల అసాధారణ గుణాలను తెలిసిన పరమహంసగారు, ఆమె కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఆశ్రమంలో ఉన్న తర్వాత, 1947లో ఆమెకు సన్యాసం యొక్క చివరి ప్రమాణాన్ని ప్రసాదించారు. ఆయన ఆమె కోసం “మృణాళినీ” అనే సన్యాసుల పేరును ఎంచుకున్నారు, ఇది తామర పువ్వు యొక్క స్వచ్ఛతను సూచిస్తుంది, ఇది ఆధ్యాత్మిక ఆవిష్కరణకు పురాతన చిహ్నం.

ఆశ్రమంలో ఆమె జీవితం ప్రారంభం నుండి, ఆయన ఆమె కోసం ఊహించిన పాత్ర గురించి – ముఖ్యంగా తన వై‌.ఎస్‌.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. పాఠాలు, రచనలు మరియు చర్చల సంపాదకురాలిగా ఆమె భవిష్యత్తు బాధ్యతను గురించి ఇతర శిష్యులతో ముచ్చటించేవారు. 1950లో రాజర్షి జనకానందకు రాసిన లేఖలో “ఆమె ఈ పనికి నిర్దేశించబడినది,” అని తెలిపారు. ఆయన తన జీవితంలోని చివరి సంవత్సరాల్లో ఆమెకు వ్యక్తిగతంగా శిక్షణ ఇవ్వడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి చాలా సమయాన్ని వెచ్చించారు.

ఆమె ప్రయత్నాల ఫలితంగా ప్రచురించబడిన రచనలలో పరమహంస యోగానందవారి ఫోర్ గోస్పెల్స్ పై (ది సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్: ది రిసరక్షన్ ఆఫ్ ద క్రైస్ట్ వితిన్ యు అనే పేరుతో) అద్భుతమైన వ్యాఖ్యానం; ఆయన విమర్శకుల ప్రశంసలు పొందిన అనువాదం మరియు భగవద్గీతపై వ్యాఖ్యానం (గాడ్ టాక్స్ విత్ అర్జున); ఆయన కవిత్వం మరియు స్ఫూర్తిదాయకమైన రచనల యొక్క అనేక సంపుటాలు; మరియు ఆయన చర్చలు మరియు వ్యాసాల యొక్క సేకరించబడిన మూడు సుదీర్ఘ సంకలనాలు — మరియు మరిన్ని రచనలు సిద్ధమవుతున్నాయి.

నవంబర్ 30, 2010న పరమపదించే వరకు యాభై ఐదు సంవత్సరాలకు పైగా సంస్థ యొక్క ఆధ్యాత్మిక తల్లిగా ప్రముఖ పాత్ర పోషించి మరియు కేవలం “మా” అని గౌరవప్రదంగా సంబోధించబడిన దివంగత, ప్రియమైన శ్రీ దయామాతగారి తరువాత మృణాళినీమాతగారు వై‌.ఎస్‌.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. యొక్క నాల్గవ అధ్యక్షురాలిగా ఎన్నికైనప్పుడు — చాలా మంది భక్తులు మృణాళినీమాత అదే స్ఫూర్తి కొనసాగించాలని తమ కోరికను వ్యక్తం చేశారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమె ఎన్నికను ప్రకటించిన కొద్దిసేపటికే క్రింది లేఖ అందింది:

ఎస్‌.ఆర్‌.ఎఫ్. బోర్డు శ్రీ మృణాళినీమాతను అధ్యక్షురాలిగా ఎంపిక చేసినందుకు నేను ప్రగాఢమైన కృతజ్ఞతా భావంతో నిండిపోయాను. ఈ సమయంలో భక్తులైన మనకు మరియు ప్రపంచానికి అవసరమైనది ఆమె మాధుర్యం. ఆమె భూమిపై ఉన్న జగన్మాత యొక్క ప్రతినిధి.

పిల్లలు తల్లిని కోల్పోయినట్లుగా, భూమిపై ఉన్న మన ఆధ్యాత్మిక తల్లి (“మా”) మరణం గురించి భక్తులు బాధపడ్డారని నాకు తెలుసు. మృణాళినీమా గురుదేవుల దగ్గరకు దాదాపు చిన్నతనంలోనే వచ్చిందని, గురుదేవులు ఆమెను ఎలా ప్రేమించారో, పెంచి పోషించారో నేను తెలియజేశాను. ఆమె తన ప్రారంభ సంవత్సరాల గురించి చెప్పిన కథలు ఆమె మరియు మాస్టర్ మధ్య మధురమైన సంబంధాన్ని మరియు ఆమె మాధుర్యాన్ని కూడా చూపుతాయి.

ఈ ఎంపికకు గురుదేవులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు మనకు మరొక తల్లి ఉందని నా భావాలను వ్యక్తపరిచాను మరియు మాస్టారుతో ఇలా అన్నాను, “ఆమెను మేము ఏమని పిలుస్తాము — మేము ఆమెను మా అని పిలవలేము, ఎందుకంటే మా ప్రియమైన శ్రీ దయామాత మాత్రమే మా. మా 2?” సమాధానం వచ్చింది, “లేదు, ‘మా 2’ కాదు — ‘మా, కూడా.’”

ఆమే మా ‘మా కూడా.’ జై గురు.

సభ్యులకు మృణాళినీమాతగారి క్రమబద్ధమైన బోధన మరియు స్ఫూర్తిదాయకమైన ఉత్తరాలు, ఈ పత్రికలో ఆమె వ్రాసిన లోతైన వివరణాత్మక కథనాలు మరియు ఆమె ప్రచురించిన అనేక ఆడియో/వీడియో చర్చలు, ఆమెకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వై‌.ఎస్‌.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. సభ్యుల ప్రేమపూర్వక గౌరవాన్ని మరియు ప్రగాఢమైన కృతజ్ఞతను సంపాదించిపెట్టాయి. ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు: “మీ హాస్యం, మీ నిష్కపటమైన జ్ఞానం, మీ ఆచరణాత్మకత, విధేయత మరియు మన గురుదేవులను గౌరవించడంలో మీ ఉదాహరణ, నన్ను ఆశతో మరియు ప్రేమించబడ్డాననే ఎరుకతో నింపాయి.” మరియు ఎన్సినీటస్ టెంపుల్ సండే స్కూల్ పిల్లల నుండి ఇటీవలి కార్డులో ఇలా ఉంది: “దేవుని వెలుగులో నివసించడానికి మాకు సహాయం చేయడానికి మీరు చాలా చేస్తున్నారు. మదర్స్ డే శుభాకాంక్షలు మరియు ఎల్లప్పుడూ ఇలాగే అద్భుతంగా ఉండండి!”

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సన్యాసులు, సభ్యులు మరియు స్నేహితులు ఈ ప్రత్యేక వార్షికోత్సవం సందర్భంగా శ్రీ మృణాళినీమాతకు సంతోషకరమైన ప్రణామాలను, మా హృదయాల ఐక్య కృతజ్ఞతలను మరియు ప్రేమను అందిస్తున్నాము.

Share this on

Collections

Author

Language

More