వై.ఎస్.ఎస్. ఆశ్రమాలను సందర్శించనున్న ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసినులు

28 జులై, 2022

2022 అక్టోబర్ మరియు నవంబర్లలో ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసినులు భారతదేశాన్ని సందర్శిస్తారని మీకు తెలియజేయుటకు మేము చాలా సంతోషిస్తున్నాము. వై.ఎస్.ఎస్. ఆశ్రమాలలో ఏర్పాటు చేయబడే ప్రత్యేక కార్యక్రమాలలో, వారు ధ్యానాలు మరియు గురుదేవుల “జీవించడం ఎలా” బోధనలపై ఆధ్యాత్మిక ప్రసంగాలను మరియు తరగతులను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలలో పురుషులు మరియు స్త్రీలు, అందరూ పాల్గొనవచ్చు. వీటిలో ఒకదానికి హాజరు కావడానికి మీకు అత్యంత స్వాగతం పలుకుతున్నాం. గురు-సోదరీమణులందరూ తమ దైనందిన జీవితంలో గురుదేవుల బోధనలను అన్వయించుకోవడానికి ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసినుల నుండి వ్యక్తిగత మార్గదర్శకత్వం పొందేందుకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని కలిగి ఉంటారు. ఈ ప్రత్యేక కార్యక్రమాల పూర్తి వివరాలను మరియు నమోదు ప్రక్రియను ఖరారు చేసిన వెంటనే మీతో మేము పంచుకుంటాము.

దయచేసి గమనించండి: ఈ కార్యక్రమాల నిర్వహణ మరియు ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసినుల భాగస్వామ్యం, ప్రతి కార్యక్రమానికి ముందు అమలులో ఉన్న కోవిడ్ ప్రయాణ పరిమితులు మరియు భద్రతా నిర్వహణా నియమాలపై ఆధారపడి ఉంటాయి.

para-ornament

Share this on