శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి జన్మాష్టమి సందేశం 2020

27 జూలై, 2020

జన్మాష్టమి 2020

ప్రియుతములారా,

మనమంతా భగవాన్ శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలను ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భక్తులతో కలిసి జరుపుకుంటున్న, ఈ ఆనందకర జన్మాష్టమి సమయంలో మీ అందరికీ ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ధర్మ పునరుద్ధారుకుడిగా, భగవంతుని యొక్క ప్రేమ మరియు కృపలకు దూతగా, మాయ యొక్క చీకటి (చెడు) పై జరిపే యుద్ధంలో జీవాత్మలను ముందుకు నడిపించడానికి శ్రీకృష్ణుడు అవతరించాడు. ఈ కాల౦లో కూడా, లోకానికి పరమాత్ముని స్వస్థతా స్పర్శ అవసర౦; కృష్ణుని జీవనం యొక్క పవిత్రత, తేజస్సుపై గాఢంగా ధ్యానించడం ద్వారా, మీరు ఆయన యొక్క నిత్య జీవన ఉనికిని అనుభూతి చెందాలని, భగవంతుడి ప్రేమ ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఉండి ఆశ యొక్క ఉపశమనం, భరోసాలను తీసుకురావాలని నేను ప్రార్థిస్తున్నాను.

భగవంతుడు మనలను తనవైపుకు ఆకర్షించే మనోహరమైన, తిరుగులేని, ఆ దివ్య ప్రేమకు శ్రీ కృష్ణుడు చాలా చక్కని ఉదాహరణ. కానీ భౌతిక ప్రపంచం మరియు అలవాట్ల యొక్క బాహ్య ఆకర్షణ బలమైనది అందువలన భ్రాంతి యొక్క సంకెళ్ల నుండి విముక్తి పొందడానికి శక్తి మరియు సంకల్పం అవసరం. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు వెనుకాడినా, కృష్ణుడు అతనిలోని నిజమైన వీరోచిత స్వభావాన్ని ప్రేరేపించాడు —  అలాగే మనం సంసిద్దులమైననపుడు ఆయన మనకూ అదే ప్రేరణను అందిస్తాడు. కష్ట సమయాలు, మనల్ని అంతర్గతంగా లేదా బాహ్యంగా, నిరుత్సాహపరచడానికి కాక, మనలోని ఉదాత్తమైన, నిర్భయ ఆధ్యాత్మిక విజేతను బయటకు తీసుకురావడానికే వస్తాయి. మనం ఆ అవకాశాలను చక్కగా వినియోగించుకుంటే, అవి మన జీవితంలో ఒక కొత్త ప్రారంబానికి ఇంకా మానజాతి చైతన్య ఉన్నతికి దోహదం చేస్తాయి. మనలో ప్రతి ఒక్కరికీ ఆ పరివర్తనలో పాలుపంచుకునే బాధ్యత మరియు అధికారము ఉంది.

శ్రీకృష్ణుడు అర్జునునికి తోడ్పాటు అందించినట్లే, మన ఆత్మకు అహంకారానికి మధ్య జరిగే అంతర్గత కురుక్షేత్ర యుద్ధంలో మనలో ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేయగలడు. భగవద్గీతలో ఆయన అందించిన సనాతన జ్ఞానం ఏమిటంటే, లోతైన ధ్యానం ద్వారా భగవత్ సంపర్కం, మరియు దైవార్పణగా మన కర్తవ్యాన్ని నిర్వహించడం కంటే ఆత్మ స్వేచ్ఛను పొందటానికివేరే గొప్ప మార్గం మరొకటి లేదు. వేల సంవత్సరాల క్రితం భగవాన్ కృష్ణుడు బోధించిన అదే విముక్తి నొసగే క్రియాయోగ శాస్త్రాన్ని మనందరి ఏకైక గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానందుల నుండి మనం పొందినందుకు మనం ఎంత ధన్యులమో. పరమాత్మలో కృష్ణునితో ఒకటైన మహావతార్ బాబాజీ, ఆ పవిత్ర శాస్త్రాన్ని పాశ్చాత్య దేశాలకు తీసుకురావడానికి మరియు ఈ ఆధునిక యుగానికి ప్రత్యేక విధిగా యావత్ ప్రపంచానికి వ్యాప్తి చేయడానికి పరమహంసగారిని ఎంచుకున్నారు. పాశ్చాత్య దేశానికి మన గురుదేవులు రాకను ఆ అమూల్యమైన బహుమతి సంస్థాపన శతజయంతిని మనము అత్యంత కృతజ్ఞతా భావంతో ఈ సంవత్సరం శతాబ్ది వేడుకలనుజరుపుకుంటున్నాము. ఈ పథం యొక్క భక్తుడిగా, దివ్య లక్ష్యానికి మార్గం మీ ముందు ఉంది; మరియు ఈ మహాత్ములు ఆశీర్వదించిన బోధనలు మరియు పద్ధతులను అనుసరించడం ద్వారా మీ విజయం సునిశ్చితం.

జై శ్రీకృష్ణ! జై గురు!

స్వామి చిదానంద గిరి

Share this on