నోయిడా చేరుకోవడం ఎలా

విమానాశ్రయాల నుండి

దేశీయ మరియు అంతర్జాతీయ విమానాశ్రయాల (IGI విమానాశ్రయం) మధ్య దూరం 6 లేక 7 కి.మీ. ఉంటుంది. మా ఆశ్రమం 40 కి.మీ దూరంలో ఉంటుంది.

టాక్సీ (ప్రాధాన్యంగా విమానాశ్రయంలో ప్రీపెయిడ్) ఆశ్రమానికి చేరుకోవడానికి సరైనదే కానీ ఖరీదైన మార్గం. చౌకైన ప్రత్యామ్నాయం ఆటో-రిక్షా.

అంతర్జాతీయ విమానాశ్రయం నుండి, ద్వారకా సెక్టార్ 21కి ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో తీసుకోండి. అక్కడ నుండి నోయిడా సిటీ సెంటర్‌ (సెక్టార్ 32)కు మెట్రో తీసుకోండి. నోయిడా సిటీ సెంటర్ నుండి, ఆశ్రమానికి ఆటో-రిక్షా తీసుకోండి (దూరం 7 కిమీ).

రైల్వే స్టేషన్ల నుండి

(పాత) ఢిల్లీ మరియు న్యూఢిల్లీ స్టేషన్ల నుండి, నోయిడా సిటీ సెంటర్‌కు (రాజీవ్ చౌక్ వద్ద మారడం ద్వారా) మెట్రో తీసుకొని, ఆ తరువాత పైన పేర్కొన్న విధంగా ఆటో-రిక్షా/టాక్సీ తీసుకోవచ్చు. రైల్వే స్టేషన్ల నుండి ఆటో రిక్షా/టాక్సీ ద్వారా కూడా నేరుగా వెళ్ళవచ్చు.

నిజాముద్దీన్ మరియు ఘజియాబాద్ రైల్వే స్టేషన్ల నుండి, మెట్రో లేనందున ఆటో-రిక్షా లేదా టాక్సీ తీసుకోవాలి.

ఇంటర్-స్టేట్ బస్ టెర్మినస్ నుండి

ISBT, కాశ్మీరీ గేట్ నుండి, నోయిడా సిటీ సెంటర్‌కు (రాజీవ్ చౌక్ వద్ద మారుతూ) మెట్రో తీసుకొని, ఆ తరువాత ఆశ్రమానికి ఒక ఆటో-రిక్షా/టాక్సీ ద్వారా చేరుకోవచ్చు లేదా ఆశ్రమానికి నేరుగా ఆటో రిక్షా/టాక్సీని కూడా తీసుకొని చేరుకోవచ్చు.

ISBT, ఆనంద్ విహార్ నుండి, మెట్రో లేనందున, నేరుగా ఆటో రిక్షా లేదా టాక్సీలో ఆశ్రమానికి చేరుకోవడం మంచిది.

ప్రైవేట్ కారు లేదా టాక్సీ ద్వారా

జతపరచబడిన రూట్ మ్యాప్‌ని అనుసరించండి, ఉదాహరణకు, ఢిల్లీ నుండి, నిజాముద్దీన్ వంతెన ద్వారా యమునా నదిని దాటి, NH24 మీద నేరుగా వెళ్ళి, UP సరిహద్దు దాటి, రెండవ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కుడివైపు తిరిగి, ఆపై మూడవ మలుపు వద్ద ఎడమ వైపుకు తిరగండి, ఆశ్రమానికి చేరుకోవడానికి మొదటి కుడి మలుపు మూల తిరగండి.

నోయిడా యోగదా సత్సంగ శాఖ ఆశ్రమం రూట్ మ్యాప్

Share this on