శ్రీ శ్రీ దయామాత 100వ జన్మదినోత్సవం

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షురాలు మరియు సంఘమాత శ్రీ శ్రీ మృణాళినీమాతగారి 2014వ నూతన సంవత్సర సందేశం

“ఈ సంవత్సరం జనవరి 31 మన ప్రియమైన శ్రీ శ్రీ దయామాత వందవ జయంతిని సూచిస్తుంది. ఆమె దైవిక జీవితం మనందరినీ స్పృశించింది, ఆమె ఆత్మ ఈ ప్రపంచానికి అతీతమైన కాంతి మరియు ఆనందకరమైన లోకాలలో స్వేచ్ఛగా ఉన్నప్పటికీ, తూర్పు మరియు పశ్చిమ రెండింటిలోనూ పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక కుటుంబంపై ఆమె చూపిన ప్రేమ మరియు సంరక్షణ ఇప్పటికీ మనతోనే ఉంది. ‘కేవలం ప్రేమ మాత్రమే నా స్థానాన్ని భర్తీ చేయగలదు’ అన్న గురుదేవుల మాటలు ఆమెలో పూర్తి వ్యక్తీకరణను కన్నుగొన్నాయి, మరియు ఆమె జీవితం యొక్క అందమైన ఉదాహరణ ద్వారా మన చైతన్యంలో ఆ మాటలు ఎల్లప్పుడూ ప్రతిధ్వనిస్తాయి.”

శ్రీ శ్రీ దయామాతగారి 100వ జయంతి సందర్భంగా శ్రీ మృణాళినీమాతగారి విశేషమైన సందేశాన్ని చదవండి

ప్రేమ, వినయము మరియు దేవునికి అర్పించబడ్డ సేవతో నిండిన జీవితం

శ్రీ దయామాతగారు అసాధారణమైన జీవితాన్ని గడిపారు – వీటిలో దాదాపు ఎనభై సంవత్సరాలు ఆమె తన గురువుగారి ఆశ్రమాలలో సన్యాసిని శిష్యురాలిగా గడిపారు, ఆమె ఆలోచనలు ఎప్పుడూ దేవుని మీద ప్రేమతో నిండి ఉండేవి మరియు ఆమె చర్యలు భగవంతుని సేవకి అంకితం చేయబడ్డాయి.

ఇంకా చదవండి…

పరమహంస యోగానందగారి గురించి శ్రీ దయామాతగారి స్మృతులు

“ఆత్మను స్మృశించిన సంఘటనలు ఎప్పుడూ అంతరించిపోవు; అవి మనలో నిత్యజీవమైన, శక్తివంతమైన భాగంగా మారతాయి. నా గురువు పరమహంస యోగానందగారితో నా పరిచయం అలాంటిది….”

వీడియొలు చూడండి మరియు మరిన్ని…

మహావతార్ బాబాజీ నుండి ఒక దీవెన: శ్రీ దయామాతగారి వ్యక్తిగత వివరణ

భారతదేశంలో పరమహంస యోగానందగారి ఆశ్రమాలను సందర్శించినప్పుడు (అక్టోబర్ 1963 – మే 1964), శ్రీ దయామాత హిమాలయాలలోని ఒక గుహకు పవిత్ర తీర్థయాత్ర చేసారు, ఈ గుహ మహావతార్ బాబాజీగారి భౌతిక ఉనికి వల్ల పావనమైయినది.

ఇంకా చదవండి…

శ్రీ దయామాతగారి నుండి సందేశాలు

దయామాతగారు సంవత్సరం అంతా మరియు సంక్షోభ సమయాలలోనూ ప్రత్యేక సందేశాలను పంచుకునేవారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సభ్యులకు మరియు స్నేహితులకు మార్గదర్శకత్వం, ప్రేరణ మరియు ఆధ్యాత్మిక ప్రోత్సాహానికి అవి నిరంతర మూలంగా ఉండేవి.

శ్రీ దయామాతగారి ఆకరి సందేశాన్ని చదవండి…

ప్రపంచవ్యాప్త ప్రార్థనా మండలి – శ్రీ దయామాతగారి నుండి ఒక ఆహ్వానము

శ్రీ దయామాతగారి నుండి ఒక ఆహ్వానం: “ప్రార్థన యొక్క బలమైన శక్తి ద్వారా ఇతరులకు సేవ చేయడానికి మాతో చేరమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను…”

ఇంకా చదవండి…

ఛాయచిత్రాల ద్వారా శ్రీ దయామాతగారి జీవితము

స్ప్రింగ్(వసంతం) 2011 సెల్ఫ్-రియలైజేషన్ మ్యాగజైన్ నుండి – వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. యొక్క ఆధ్యాత్మిక అధ్యక్షురాలిగా శ్రీ దయామాతగారి ఉత్తరాధికారం యొక్క చిత్రపరమైన వర్ణన.

శ్రీ దయామాతగారిపై యోగదా సత్సంగ పత్రిక ప్రత్యేక సంచిక జనవరి-మార్చి 2011 అభినందన కాపీ అభ్యర్థనపై అందుబాటులో ఉంది. (భారతదేశంలో మాత్రమే)

ఆడియో – వీడియో సత్సంగము

శ్రీ దయామాతగారి పుస్తకములు మరియు రికార్డింగ్ లు

స్మృత్యార్థం: శ్రీ దయామాత

పసాదేనా సివిక్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా స్మారక సేవ యొక్క పూర్తి-నిడివి వీడియో, ప్రపంచవ్యాప్త సందేశాలు మరియు నివాళులు, మీడియా కవరేజ్ మరియు మరిన్ని.

ఇంకా చదవండి…

Share this on