స్వర్గలోకపు వెలుగులా

స్వర్గలోకపు వెలుగులా

ముక్తిమాత ద్వారా

అరవై సంవత్సరాలకు పైగా పరమహంస యోగానందగారి శిష్యురాలు, సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ పరిచారకులు అయిన ముక్తిమాత (1922-2008) 1945లో గురుదేవులను కలిశారు. ఇక్కడ సంగ్రహించిబడిన సి‌.డి రికార్డింగ్‌లో, పరమహంసగారితో తన అనుభవాలను కొన్నింటిని ఆమె వివరించారు.

“ఆయన విశ్వంలా ఉండేవారు: అన్నీ తెలిసినవారు, అన్నీ గ్రహించేవారు
మరియు తన వద్దకు వచ్చిన ప్రతి ఆత్మ పట్ల ఆయనకు ఉన్న ప్రేమ:
అద్భుతమైన, అసాధారణమైన, స్వచ్ఛమైన, స్వర్గం నుండి వచ్చిన వెలుగు వంటిది.”

A hundred thousand unseen veils were swiftly pulled back….
“Like the Light From Heaven” సి.డి. నుండి (7:01 నిమిషాలు)

నేను 1945 చివరలో ఊహించని విధంగా సెల్ఫ్-రియలైజేషన్ బోధనలకు మరియు గురుదేవులకు పరిచయం చేయబడ్డాను. నా జీవితంలోకి ఏదో ఒక విషయం రాబోతోందని నేను గ్రహించాను మరియు “ప్రభూ, నీవు ఉన్నట్లయితే, దానిని నాకు నిరూపించమని నీకు సవాల్ చేస్తున్నాను,” అని అన్నాను. ఇది చాలా బలమైన అభ్యర్ధన. అది జరిగిన రెండు వారాల తర్వాత, ఒక స్నేహితుడు వచ్చి, “హాలీవుడ్‌కి వెళ్దాం పద,” అని మామూలుగా అన్నాడు.

మేము చర్చికి వెళతామని నేను కలలో కూడా ఊహించలేదు – సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ చర్చి. మరియు నా స్నేహితుడు నాకు పేరు చెప్పినప్పుడు, నేను అనుకున్నాను, “సరే, దాని అర్థం ఏమిటి?” మతం గురించిన తాత్విక ఆలోచనలు మొదలైనవాటి గురించి చర్చిస్తూ ఒక తాత్విక పరిచారకులు ఉండవచ్చు అని నేను అనుకున్నాను.

కానీ గురుదేవులు కనిపించి, నేను ఆయన్ను చూడగానే నాకిలా అనిపించింది, “ఈయన మామూలు వ్యక్తి కాదు. ఈయనకి దేవుడు తెలుసు.” నేను తరచుగా అనుకుంటాను, “సర్వజ్ఞత గురించి మీరు ఎవరికైనా ఎలా వివరించగలరు?” మన ప్రతి ఆలోచన, ప్రతి అనుభూతి, మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి వెళ్తున్నామో ఆయనకు తెలుసు. (మంచిదే, ఎవరో ఒకరికి తెలిసినందుకు ధన్యవాదాలు!) కానీ హాలీవుడ్ మందిరంలో ఆ మొదటి పరిచయం తర్వాత, భవనం నుండి బయటకు వెళ్ళినప్పుడు నేను భౌతికముగా మాత్రమే బయటకు వెళ్తున్నానని, వేరే విధంగా కాదని నాకు తెలుసు.

నేను పెరుగుతున్నప్పుడు, ప్రతి రెండు లేదా మూడు సంవత్సరాలకు నేను ఒక జత గోధుమ రంగు కళ్ళను చిత్రీకరించేదాన్ని మరియు ఆ నేత్రాలలో నేను శాశ్వతత్వం యొక్క వ్యక్తీకరణను సృష్టించడానికి ప్రయత్నిoచేదాన్ని మరియు నా ఏకాగ్రత కొన్నిసార్లు ఎంత ఏకపక్షంగా ఉండేదంటే, అవి నాకు సజీవమైనట్లుగా ఉండేవి; అవి నిజమైనవి. ఆపై గురుదేవులను చూడగానే నాకు అవే కళ్ళు కనిపించాయి.

“ఆయన విశ్వంలా ఉండేవారు: అన్నీ తెలిసినవారు, అన్నీ గ్రహించేవారు. మరియు తన వద్దకు వచ్చిన ప్రతి ఆత్మ పట్ల ఆయనకు ఉన్న ప్రేమ: అద్భుతమైన, అసాధారణమైన, స్వచ్ఛమైన, స్వర్గం నుండి వచ్చిన వెలుగు వంటిది.

పరమహంస యోగానందగారితో తన జీవిత స్మృతులపై ముక్తిమాత యొక్క పూర్తి సంభాషణ కోసం సి.డి.ని ఆర్డర్ చేయండి.

ఆర్డర్ చేయండి

Share this on